
చాలా మంది నటీమణులకు హీరోయిన్ కావడానికి మోడలింగ్ ఒక మంచి మార్గంగా మారుతుంది. తాజాగా కథానాయికగా అవతారమెత్తిన మోడల్ డాలీ ఐశ్వర్య. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న 23 గంటల్లో తెరకెక్కించిన కళైంజర్ నగర్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం కానుంది. ఆ చిత్రం తర్వాత ఇప్పుడు వరుసగా పలు చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. దీని గురించి డాలీ ఐశ్వర్య తెలుపుతూ నటనపై ఆసక్తి కలగడంతోపాటు నటిగా మారడానికి మోడలింగ్ రంగాన్ని మార్గంగా ఎంచుకున్నానని చెప్పింది.
ఇంతకుముందు ఒక షార్ట్ ఫిలింలో నటించానని చెప్పింది. ఇక కళైంజర్ నగర్ చిత్రంలో నటించే అవకాశం అనుకోకుండా వచ్చిందని తెలిపింది. ఈ చిత్రంలో నటించాల్సిన నటి అనుహ్యంగా ప్రమాదంలో చిక్కుకోవడంతో ఆ అవకాశం తనను వరించిందని పేర్కొంది. రెండో రోజే షూటింగ్ అని చెప్పడం, అది 23 గంటల్లోనే రూపొందిస్తున్న రికార్డ్ చిత్రం కావడంతో ఇందులో నటించడానికి ఆందోళన చెందానంది. అయితే స్క్రిప్ట్ చదవగానే నమ్మకం కలిగిందని పేర్కొంది. ఒకే రోజులో 19 లొకేషన్లలో షూటింగ్‌ను నిర్వహించడంతో ఒక లొకేషన్ నుంచి మరో లొకేషన్‌కు మారడానికి 10, 15 నిమిషాలు మాత్రమే సమయం ఉండేది అని చెప్పింది.
యూనివర్సల్ జీనియస్ అనే రికార్డు కోసం ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపింది. ఇలా తన తొలి చిత్రమే ఒక రికార్డు చిత్రం కావడం సంతోషంగా ఉందని పేర్కొంది. దీంతోపాటు ఇప్పుడు 2 ఇరైవిల్ కంగల్ అనే సైంటిఫిక్ థ్రిల్లర్ కథా చిత్రం, హ్యాపీ బర్త్‌డే జూలీ అనే మరో థ్రిల్లర్ కథా చిత్రం, కడైసీ తోట అనే క్రైమ్ కథా చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు తెలిపింది. ఇలా వివిధ నేపథ్యాలతో కూడిన కథా చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ఆనందంగా ఉందని వెల్లడించింది. పెద్ద పెద్ద సంభాషణలు కలిగిన సాహసోపేతమైన కథాచిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానంది.
Comments
Please login to add a commentAdd a comment