సాక్షి, చెన్నై: సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా మన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం దొరుకుంది. వాటిని ప్రపంచంతో పంచుకునే వీలు దొరుకుతుంది. అయితే కొంత మంది విషయంలో మాత్రం ఇదే సోషల్ మీడియా ఇబ్బందులకు గురిచేస్తోంది. మితిమీరిన ట్రోల్స్ రూపంలో కొందరి ప్రాణాల మీదకు వస్తోంది. అలాంటి సంఘటన ఒకటి తమిళ నటి విజయలక్ష్మి విషయంలో జరిగింది. చదవండి: పోలీసులను ఆశ్రయించిన తరుణ్ భాస్కర్
సోషల్ మీడియాలో నటి విజయలక్ష్మి మీద విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుండంతో ఆమె మనస్తాపం చెందారు. దాంతో ఆమె ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. తన సూసైడ్‌కు కారణం నామ్ తమిజార్ పార్టీ నాయకుడు సీమన్, పనంకట్టు పాడై పార్టీకి చెందిన హరి నాదర్ అనుచరులు అని పేర్కొన్నారు. విపరీతంగా ట్రోలింగ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. వారికి వ్యతిరేకంగా తన అభిప్రాయలు చెప్పడంతో వారి అభిమానులు తనను హద్దు దాటి మరీ ట్రోల్ చేశారని నటి పేర్కొంది. వాటిని భరించడం తనవల్ల కాదని, కుటుంబం కోసం ఓర్చుకున్నా తట్టుకోలేక ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు విజయలక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పోస్టు చేసింది.
తనను ఆన్‌లైన్‌లో వేధించి సూసైడ్‌కు పాల్పడేలా చేసిన సీమన్, హరినాదర్‌లను అరెస్ట్ చేయాలని విజయలక్ష్మి డిమాండ్ చేసింది. తాను మరణించిన తరువాత అయిన ఇలాంటి ట్రోల్స్ చేయకూడదని అభిమానులు తెలుసుకోవాలని విజయలక్ష్మి కోరింది. ఆత్మహత్య చేసుకోవడానికి బీపీ మాత్రలు మింగటంతో నటి పరిస్థితి విషయంగా మారింది. రక్తపోటు తగ్గిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆమెకు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చదవండి: నల్లజాతి నినాదం సారాపై ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment