
సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతుండటంతో మనస్తాపం చెందిన తమిళ నటి విజయలక్ష్మి ఆదివారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తను చావును కోరుకోడానికి కారణం నామ్ తమిళర్ కచ్చి పార్టీ నాయకుడు సీమన్, పనంకట్టు పాడై పార్టీకి చెంది హరి నాదర్ అని అంతకు ముందు వీడియోలో పేర్కొన్నారు. అయితే ఆమె బలవన్మరణానికి పాల్పడటం కూడా డ్రామానే అంటూ కొందరు కించపరిచేలా మాట్లాడుతున్నారు. వీటికి సమాధానంగా ఆమె ఆస్పత్రి నుంచే ఓ వీడియోను పోస్టు చేశారు. (బీపీ మాత్రలు మింగిన నటి, పరిస్థితి విషమం!)
"ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. మీ ప్రేమాభిమానాల వల్ల క్షేమంగా ఉన్నాను. కానీ నేను చనిపోతుంటే కూడా రాజకీయం చేస్తున్నారు. సీమాన్ లాంటివాళ్లు ఇలాంటి పనులు ఎలా చేస్తారో నాకర్థం కావడం లేదు. కానీ నేను నిజంగానే చావాలనుకున్నాను. ఇందులో డ్రామా ఏం లేదు. నా బీపీ, హృదయ స్పందన రేటు కూడా ఇంకా సాధారణ స్థితికి రాలేదు. ఇంకా నేను పోరాడుతూనే ఉన్నాను. నేనెవరి కోసమో ఆత్మహత్యాయత్నం అంటూ డ్రామా చేయలేదు. కేవలం సీమాన్ వల్లే ఆస్పత్రిపాలయ్యాను. అతను మనిషా లేక జంతువా నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి నేను ఫలానా పార్టీ బంటును అని వాగడం మానేయండి. దీన్ని రాజకీయం చేయకండి, నేనేం అంతలా దిగజారిపోలేదు. ఇప్పటికే ఎంతో భరించాను. దయచేసి ఇంకా చెడుగా మాట్లాడుతూ వేధించకండి" అని కోరారు. కాగా విజయలక్ష్మి తెలుగులో "హనుమాన్ జంక్షన్" సినిమాలో నటించారు. పలు తమిళ, కన్నడ సినిమాల్లోనూ హీరోయిన్‌గా కనిపించారు. (చావు నుంచి కాపాడినందుకు థ్యాంక్స్)
Comments
Please login to add a commentAdd a comment