'నా సినిమా'.. సంచలనం | tollywood actress tara choudary making her real story as movie | Sakshi
Sakshi News home page

'నా సినిమా'.. సంచలనం

Published Wed, May 6 2015 3:05 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'నా సినిమా'.. సంచలనం - Sakshi

'నా సినిమా'.. సంచలనం

తనకు జరిగిన అన్యాయంపై సినిమా నిర్మించడానికి కథను రూపొందిస్తున్నానని, అందులో ఓ ప్రముఖ నటి హీరోయిన్‌గా నటించనుందని సినీ నటి తారాచౌదరి వెల్లడించారు. చాలా రోజుల తర్వాత ఓ గొడవ ద్వారా వార్తల్లోకి వచ్చిన తారా చౌదరి తన నివాసంలో సాక్షితో మాట్లాడారు. తాను తీసే సినిమాలో చాలా సంచలనాలు ఉండబోతున్నాయని, తనను కేసుల్లో ఎలా ఇరికించారు, ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలను ప్రస్తావించబోతున్నట్లు వెల్లడించారు. దీనికంటే ముందు తానే నిర్మాతగా భారీ బడ్జెట్‌తో మరో సినిమాను నిర్మిస్తున్నట్లు, వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని తెలిపారు.

ప్రజా సేవే లక్ష్యం..
మొదటి సినిమా పూర్తవగానే సమాజ సేవకు నడుంబిగిస్తానని ఆమె తెలిపారు. వృద్ధులు, అనాథలు, వికలాంగులకు ఆశ్రమాలు నిర్మించే యోచన ఉందన్నారు. సేవా కార్యక్రమాల కోసం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏడు సంవత్సరాలుగా పబ్లిసిటీ లేకుండా సమాజసేవ చేస్తున్నానని, ఒంగోలు, గుంటూరు, తెనాలిలో పలు సహాయ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. చాలా మంది బడాబాబులు సమాజ సేవ కోసం డబ్బులు ఇస్తుంటారని, అయితే ఒక వేదిక లేకపోవడంతో వారు విరాళాలు ఇవ్వలేకపోతున్నారని అన్నారు.  తనకు తెలిసిన మిత్రులతో ఫౌండేషన్ ద్వారా ఈ విరాళాలను సమాజ సేవ కోసం వినియోగిస్తానని తెలిపారు.

పెళ్లి ఆలోచన ఇప్పట్లో లేదు...
ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటానని, పరిచయం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకునే యోచన ఉందన్నారు. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోబోనని రెండు సినిమాలు పూర్తయిన తర్వాతనే వచ్చే ఏడాది వివాహం చేసుకుంటానని వెల్లడించారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశా..
 2012 మార్చి 31వ తేదీన అక్రమ కేసుల ద్వారా అరెస్టు అయి జైలు జీవితం గడిపానని, విడుదలైన తర్వాత బెంగళూర్ వెళ్లి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు చెప్పారు. వ్యాపారంలో మంచి ఆదాయం వచ్చిందని, ఇప్పుడు ఆ డబ్బుతోనే సినిమా తీయాలనే లక్ష్యంతో ఇటీవలే హైదరాబాద్‌కు మకాం మార్చినట్లు తెలిపారు.

రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు..
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అసలే లేదన్నారు. సమాజంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఎదురించడం, అన్యాయం చేసిన వారిపై కక్ష తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement