బ్రాహ్మణ పుట్టుక కామెంట్‌.. వివాదం | BJP MP Suresh Gopi Brahmin Comments gets trolled | Sakshi
Sakshi News home page

నటుడు సురేష్‌ గోపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Published Wed, Sep 27 2017 1:13 PM | Last Updated on Wed, Sep 27 2017 4:05 PM

BJP MP Suresh Gopi Brahmin Comments gets trolled

సాక్షి,  తిరువనంతపురం :  మాట్లాడే హక్కు.. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన వరం. అలాగని నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే మాత్రం చట్టం ఊరుకోదు. ఇక్కడ అదే పని చేసి ఇప్పుడు వివాదంలో ఇరుకున్నారు నటుడు, ఎంపీ సురేష్‌ గోపి. 

బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సురేష్‌ గోపీ ఈ మధ్యే తిరువనంతపురంలో బ్రహ్మణ సంఘాలు నిర్వహించిన యోగక్షేమ సభకు హాజరయ్యారు. అక్కడ ఆయన ప్రసంగిస్తూ... మళ్లీ బ్రాహ్మణుడిగానే పుట్టాలని ఉందంటూ వ్యాఖ్యలు చేశాడు. ‘పునర్జన్మ మీద నాకు నమ్మకం ఉంది. జంధ్యం వేసుకునే కులంలో జన్మించా. వచ్చే జన్మలో కూడా ఇదే కులంలో పుట్టాలని కోరుకుంటున్నా. తద్వారా భగవంతుడికి మరింత సేవ చేసుకునే భాగ్యం నాకు కలుగుతుంది’ అంటూ ప్రసంగించారు. 

వెంటనే అక్కడ హాజరైన సభీకులంతా హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు చరిచారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో మాత్రం ఘాటు కామెంట్లు వస్తున్నాయి. ఓ ఎంపీ అయి ఉండి కుల ప్రస్తావన తేవటంపై మండిపడుతున్నారు. ఆదిమగోపి పేరిటి యాష్‌ ట్యాగ్‌ను ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో వైరల్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లనా? మనం పార్లమెంట్‌కు పంపింది అని ప్రముఖ పాత్రికేయురాలు ఛార్మీ జయశ్రీ హరికృష్ణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement