మలయాళ నటుడు సురేష్ గోపి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దిగారు. త్రిస్సూర్ నుంచి తన స్టార్ ఇమేజ్‌ను నమ్ముకొని పోటి చేసిన సురేష్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సురేష్ గోపి ఈ సారి త్రిస్సూర్ నుంచి లోకసభ బరిలో అధృష్టాన్ని పరీక్షించుకున్నారు. విద్యార్థి నాయకుడిగా సీపీయం విద్యార్థి విభాగం ఎస్‌ఎఫ్‌ఐ తరపున ఎన్నో పోరాటాలు చేసిన అనుభవం ఎన్నికల్లో సురేష్ గోపికి ప్లస్ అవుతుందని భావించారు.
2006 ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన సురేష్ గోపి, ప్రస్తుతం బీజేపీ నుంచి బరిలో నిలిచారు. సురేష్ గోపికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఎన్ ప్రతాపన్, సీపీఐ అభ్యర్థి రాజాజీ మాథ్యూ థామస్‌ల నుంచి గట్టిపోటి ఎదురైంది. ముందుగా త్రిస్సూర్ నుంచి తుషార్‌ను బరిలో దించాలని భావించిన బీజేపీ చివరి నిమిషంలో తుషార్‌ను వాయ్‌నాడ్ నుంచి, సురేష్ గోపిని త్రిస్సూర్ నుంచి బరిలో నిలిపారు.
Comments
Please login to add a commentAdd a comment