మరో హీరోకి కేంద్రమంత్రి ఛాన్స్ ! | Actor Suresh Gopi may get Rajya Sabha nomination | Sakshi
Sakshi News home page

మరో హీరోకి కేంద్రమంత్రి ఛాన్స్ !

Published Thu, Apr 21 2016 12:21 PM | Last Updated on Fri, Mar 29 2019 8:34 PM

మరో హీరోకి కేంద్రమంత్రి ఛాన్స్ ! - Sakshi

మరో హీరోకి కేంద్రమంత్రి ఛాన్స్ !

తిరువనంతపురం : ప్రముఖ మలయాళ నటుడు సురేష్ గోపికి కేంద్రమంత్రి పదవి వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు కమలనాథులు. సురేష్ గోపిని కేరళ నుంచి రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ అగ్రనేతలు నిర్ణయించినట్లు సమాచారం. గత ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సురేష్ గోపి న్యూఢిల్లీలో సమావేశమై... ఈ అంశంపై చర్చించారని తెలిసింది.

కాగా సురేష్ గోపిని నేషనల్ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో నియమించాలని కమలం పార్టీ అగ్రనేతలు ఇప్పటి వరకు భావించారు. కానీ అమిత్ షాతో సురేష్ గోపి భేటీ అనంతరం తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. ఆయన్ని రాజ్యసభకు నామినేట్ చేసి మోదీ మంత్రివర్గంలో చోటు కల్పించాలని సదరు నాయకుల మధ్య ప్రచారం సాగుతోంది. ఎందుకంటే నరేంద్రమోదీ కేబినెట్లో కేరళ రాష్ట్రం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ అవకాశం సురేష్ గోపికి ఇవ్వాలని వారు నిర్ణయించారు.

అయితే కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 16 తేదీన జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో తిరువనంతపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన్ని ఎన్నికల బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయాన్ని సురేష్ గోపి సున్నితంగా తిరస్కరించారు.  కేరళ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నాయి. అందులోభాగంగా ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఆయనతోపాటు సురేష్ గోపి కూడా ఈ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిసింది.  ఇప్పటికే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన మరోవైపు బీజేపీకి ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement