చంద్రబాబును కలిసిన సురేష్‌ గోపి | Suresh Gopi meets Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబును కలిసిన సురేష్‌ గోపి

Published Fri, Nov 24 2017 8:05 PM | Last Updated on Fri, May 25 2018 7:10 PM

Suresh Gopi meets Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: మొదటిసారిగా ఏపీ రాజధాని అమరావతికి రావడం చాలా ఆనందంగా ఉందని మలయాళ హీరో, రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపి అన్నారు. శుక్రవారం సీఎం చంద్రబాబును సచివాలయంలో ఆయన కలిశారు. కేరళలో జరిగే జాతీయ బనానా ఫెస్టివల్‌కు చంద్రబాబును ఆహ్వనించారు. ఈ సందర్భంగా సురేష్‌ గోపి మాట్లాడుతూ... 2018 ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు తన సొంత గ్రామం కల్లియార్‌లో జరగనున్న జాతీయ అరటిపళ్ల ఉత్సవానికి చంద్రబాబును ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఈ ఫెస్టివల్‌కు జాతీయస్థాయిలో విద్యార్థులు, శాస్త్రవేతలు, అరటి రైతులు హాజరవుతారని చెప్పారు.

దేశంలో అరటి ఉత్పత్తిలో ఏపీ అగ్ర స్థానంలో ఉన్నందున.. ముఖ్య అతిథిగా పాల్గొనాలని చంద్రబాబును కోరినట్టు వెల్లడించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలిసి ఆహ్వానిస్తామన్నారు. ఈ ఫెస్టివల్ లో 457 రకాల అరటి ఉత్పత్తులు ప్రదర్శనకు రానున్నాయి. కల్లియార్ గ్రామ పంచాయతీ, కేంద్ర, రాష్ట్ర సంస్థల భాగస్వామ్యంతో సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ సోషల్‌ యాక్షన్‌(సీఐఎస్‌ఎస్‌ఏ) ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement