మోడీ కోరుకుంటే కేబినెట్ లో చేరుతా!
కోచి: రాష్ట్రపతి భవన్ లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి నరేంద్రమోడీ ఆహ్వానించడంపై మలయాళ సూపర్ స్టార్ సురేశ్ గోపి ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేను సాధించిన అన్ని అవార్డుల్లో కంటే మోడీ ఆహ్వానమే గొప్పదని సురేశ్ గోపి అన్నారు.
ఫలితాలు రాకముందే తనకు ఆహ్వానం పంపారని సురేశ్ గోపి తెలిపారు. ఎన్నికల్లో గెలుపుపై ఆయనకు ధీమాకు నిదర్శనమని మోడీపై సురేశ్ గోపి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రపతి భవన్ జరిగే కార్యక్రమానికి తాను హజరవుతున్నానని సురేశ్ గోపి తెలిపారు.
ఎన్నికల సమయంలో పోటీ చేయనున్నట్టు సురేశ్ గోపి పేరు వినిపించింది. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేయడానికి సురేశ్ గోపికి వీలు కాలేదు. మోడీ కోరుకుంటే కేబినెట్ లో చేరడానికి సిద్దమని సురేశ్ గోపి తెలిపారు.