
జక్కన్న... దర్శకేంద్రుడిని ఫాలో అవుతున్నాడా?
హైదరాబాద్ : వెండితెర సెల్యూలాయిడ్పై తనదైన శైలిలో చిత్ర రాజాలను చెక్కుతున్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి అలియాస్ జక్కన్న. భారీగా పెరిగిన జుట్టు, గెడ్డంతో ఉన్న రాజమౌళిని చూస్తుంటే ఆయన గురువు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావునే ఫాలో అయిపోతున్నట్లు ఉన్నారు. ఎందుకంటే దర్శకేంద్రుడు రాఘవేంద్రుడు కూడా ఏదైనా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించిన దగ్గర నుంచి అది పూర్తి అయ్యేవరకూ గెడ్డం తీయకుండా ఉంటారు. ఆ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు రావాలి, అ తర్వాతే రాఘవేంద్రుడు తిరుమల వెళ్లి.. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరునికి తలనీలాలు, గెడ్డం సమర్పించుకుంటారు. ఆ విషయం అందరికి తెలిసిందే.
చూడబోతే రాజమౌళి కూడా రాఘవేంద్రుడి అడుగులో అడుగు వేస్తున్నట్లున్నారు. ఎందుకంటే రాజమౌళి కూడా జుట్టు, గెడ్డం భారీగా పెంచేశారు. దాదాపు మూడేళ్ల కష్టం.... రూ. 250 కోట్ల భారీ బడ్జెట్.... దేశ విదేశాల నుంచి సాంకేతిక సహాయకులు ...అత్యుత్తమ గ్రాఫిక్స్... భారీ తారాగణంతో నిర్మించిన చిత్రం బాహుబలి. ఆ చిత్రం శుక్రవారం విడుదలైంది. చిత్రం హిట్ అని ప్రేక్షకుల నుంచి టాక్ వస్తుంది. మరీ గురువుగారి లాగానే రాజమౌళి కూడా తిరుమల వెళ్తారా? లేక ఎస్ఎస్ రాజమౌళి పేరులోనే ఉన్న శ్రీశైలం వెళ్తారా? లేక రాజమౌళి గెడ్డం తీస్తాడా లేదా అనేది ఫిల్మ్ నగర్ టాక్.