
శ్రీవారి సేవలో రాఘవేంద్రరావు, కీరవాణి
తిరుమల: ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత భారవి శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు ఆలయానికి వచ్చారు. నాగార్జున కథానాయకుడిగా ‘ ఓం నమో వేంకటేశాయ’’ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కథ ప్రతులను స్వామి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించారు. అనంతరం స్థానిక అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, రాఘవేంద్రరావుతో బేటీ అయి చర్చించారు. ఈ కొత్త చిత్రం ప్రారంభంలో భాగంగానే ఈనెల 16వ తేదీన నాగార్జున తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకునే అవకాశం ఉంది.