భాస్కర్ రాజు, రఘురాజు, ఉదయ్ కుమార్, రాఘవేంద్రరావు, ఈశ్వర్
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా హీరో హీరోయిన్లుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘4 లెటర్స్’. ‘కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే’ అనేది ఉపశీర్షిక. చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 30న ఆడియోను, వచ్చే నెల రెండో వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ప్రవాస భారతీయుడైన ఉదయ్‌కుమార్‌గారు నిర్మించిన ఈ చిత్రం టీజర్ యువతరం మనోభావాలకు అద్దం పట్టేలా ఉంది. సత్యానంద్ శిష్యరికం కాబట్టి హీరోగా ఈశ్వర్ చక్కని ప్రతిభ కనబరిచాడు.
ఈశ్వర్‌కు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది. ఉదయ్‌కుమార్–రఘురాజ్‌లు ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని అన్నారు. ‘‘రాఘవేంద్రరావుగారి చేతులమీదుగా మా సినిమా టీజర్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈశ్వర్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు’’ అన్నారు నిర్మాతలు. ‘‘రాఘవేంద్రరావుగారి చేతులమీదుగా మా సినిమా టీజర్ రిలీజ్ అవ్వడం శుభసూచికం. ప్రేమ, పెళ్లి విషయాల్లో నేటియువత ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? వాస్తవాలు ఏంటి? అనే అంశాలను సినిమాలో చూపించాం’’ అని రఘురాజ్ అన్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment