
కేయస్వీ, విప్లవ్, రాఘవేంద్రరావు
పసి వయసుకి.. యుక్త వయసుకి మధ్య గున్న ప్రాయంలో ఉన్న కొంతమంది స్నేహితుల కథతో రూపొందుతోన్న చిత్రం ‘గున్న’. సాలగ్రామ్ సినిమా పతాకంపై విప్లవ్.కె దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం నేపథ్యాన్ని, పాత్రల స్వభావాన్ని తెలిపేందుకు తయారు చేయించిన ప్రీ–పోస్టర్, లోగోను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఆవిష్కరించి, ‘‘లోగో డిజైన్ బాగుంది. టీమ్‌కి మంచి పేరు రావాలి’ అన్నారు.
‘‘ఎనిమిది నెలలుగా ప్రధాన పాత్రల ఎంపిక జరుగుతోంది. సామ్రాట్, ప్రజ్ఞాత, నిఖిల్, ఆర్మాన్ , మెహక్, ఐశ్వర్యలను ఎంపిక చేశాం. త్వరలో మిగిలిన ఇద్దరు ఆర్టిస్ట్‌లను ఎంపిక చేసి, మార్చిలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. కేయస్వీ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కాస్టింగ్ డైరెక్టర్: హర్ష ఉప్పలూరి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, పాటలు: డా. జివాగో, డిఓపి: భరణి.కె.ధరన్ , ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల, నిర్మాణ నిర్వాహణ, లైన్ ప్రొడ్యూసర్: సి.హెచ్.వి.ఎస్.ఎన్ .బాబ్జీ.
Comments
Please login to add a commentAdd a comment