
వెంకన్నను దర్శించుకున్న దర్శకేంద్రుడు
తిరుమల : తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితోపాటు మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటలు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట.. కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.