
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న పెళ్లి సందD. మూవీ నుంచి మరో పాట విడుదల అయింది. రాఘవేంద్రరావు పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ‘బుజ్జులు బుజ్జులు’అనే ఫోక్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. బాబా సెహగల్, మంగ్లీ ఆలపించిన ఈ సాంగ్ కు చంద్రబోస్ లిరిక్స్ అందించారు.
ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక ‘పెళ్లి సందడి’కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన “ప్రేమంటే ఏంటి” సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.







Comments
Please login to add a commentAdd a comment