roshanna
-
Pelli SandaD: ఆకట్టుకుంటున్న ‘బుజ్జులు బుజ్జులు..’ సాంగ్
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న పెళ్లి సందD. మూవీ నుంచి మరో పాట విడుదల అయింది. రాఘవేంద్రరావు పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ‘బుజ్జులు బుజ్జులు’అనే ఫోక్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. బాబా సెహగల్, మంగ్లీ ఆలపించిన ఈ సాంగ్ కు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక ‘పెళ్లి సందడి’కి అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన “ప్రేమంటే ఏంటి” సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. -
ఎస్సీ అభ్యర్థులకు గ్రూప్–1,3 శిక్షణ
అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వం గ్రూప్–1,3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఎస్సీ అభ్యర్థులకు ఎంపానల్డ్ ఇనిస్టిట్యూషన్స్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు రోశన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని, వార్షిక ఆదాయం రూ. 6లక్షలకు మించరాదని పేర్కొన్నారు. -
హమ్మయ్య... ఆధార్ చాలట!
అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు స్కాలర్‌షిప్పునకు, ఫీజు రీయింబర్స్‌మెంటుకు తల్లిదండ్రుల రేషన్‌కార్డు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ సంక్షేమశాఖల నోడల్ అధికారి రోశన్న తెలిపారు. ఆధార్ కార్డు ఉంటే చాలన్నారు. రేషన్‌కార్డుతో ముడిపెట్టడంతో వేలాదిమంది దరఖాస్తుకు నోచుకోనందున సడలింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.