
సన్యాసినిగా స్వీటీ?!
‘బాహుబలి’ సినిమాలో డీ-గ్లామరైజ్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ మలి భాగంలో అనుష్క గ్లామరస్‌గా కనిపించనున్నారు. మధ్యలో ‘సైజ్ జీరో’ సినిమా కోసం 20 కిలోల బరువు పెరిగి ‘చక్కనమ్మ కొంచెం లావెక్కినా అందమే’ అని నిరూపించారు. ప్రస్తుతం చేస్తున్న ‘భాగమతి’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం కోసం మళ్లీ సన్నగా నాజూగ్గా తయారయ్యారు స్వీటీ.
ఇలా విభిన్న రకాల పాత్రలు, వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళుతున్న అనుష్క మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సమాచారం. నాగార్జున ప్రధాన పాత్రలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఈ చిత్రంలో అనుష్క సన్యాసిని పాత్రలో కనిపించనున్నారట. ఇదే గనక నిజమైతే స్వీటీ కెరీర్‌లో ఇదొక వెరైటీ రోల్‌గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.