
పాఠాలు మొదలెట్టిన దర్శకేంద్రుడు
సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, తన అనుభవాన్ని పాఠాలుగా నేర్పించడానికి సిధ్దమయ్యారు. చాలా కాలం క్రితమే కెఆర్ఆర్ క్లాస్రూమ్ పేరుతో ప్రొమో రిలీజ్ చేసిన దర్శకేంద్రుడు. తాజాగా తన తొలి ఎపిసోడ్ను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్లో దర్శకుడు కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..? స్క్రీప్ట్ ను ఎలా అర్థం చేసుకోవాలి..? తానెలా డైరెక్టర్ అయ్యాను..? అనే అంశాలను ప్రస్థావించారు.
అంతేకాదు ఎపిసోడ్ చివరలో.. తన ముందున్న టేబుల్ మీద నంది అవార్డుతో పాటు డబ్బుల కట్టలను ఎందుకు పెట్టానో కామెంట్ చేయండి అంటూ ప్రేక్షకులకు పజిల్ వేశారు. దర్శకేంద్రుడి తొలి పాఠంపై ఆయన శిష్యుడు రాజమౌళి స్పందించారు. 'మీరు చెప్పిన పాఠం నేను అసిస్టెంట్గా పనిచేసిన రోజులకు సరిగ్గా సరిపోతుంది. క్రాంతిగారి దగ్గర పనిచేసినప్పుడు నేను బెరుగ్గా ఉండేవాణ్ని, మీ దగ్గర పని చేసే సమయంలో కొంత యాక్టివ్ అయ్యాను. అదే నా తొలి విజయానికి కారణం అయ్యింది.
అందుకే సహాయ దర్శకుడు యాక్టివ్గా ఉండటంతో పాటు అన్ని విషయాలను గమనిస్తూ ఉండాలి'. అంటూ ట్వీట్ చేశారు. కెఆర్ఆర్ క్లాస్ రూమ్ తొలి ఎపిసోడ్ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేసిన రాజమౌళి. '50 ఏళ్ల అనుభవాన్ని కొన్ని నిమిషాలకు కుదించి చెపుతున్నారు. ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్నవారు తప్పక చూడాల్సిన వీడియో' అంటూ కామెంట్ చేశారు.
50 years of experience condensed into few minutes. KRR's classroom is a must watch for every film enthusiast.https://t.co/5mYROczfV6
— rajamouli ss (@ssrajamouli) 11 June 2016
eventually resulted in my first break student no:1.
So so important for the asst directors to be active and observant.
— rajamouli ss (@ssrajamouli) 11 June 2016