
ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన టాలీవుడ్ ప్రముఖులు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు టాలీవుడ్ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా నిలుస్తామని తెలుగు సినీ పరిశ్రమ తెలిపింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కె. రాఘవేంద్రరావు, అశ్వినీదత్, కెఎల్ నారాయణ, కె వెంకటేశ్వర్‌రావు, జెమిని కిరణ్, జీకే తదితరులు చంద్రబాబుని శుక్రవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. అఖిల పక్షం పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏప్రిల్ 6 వరకు నల్లబ్యాడ్జీలు ధరించనున్నట్టు సినీ ప్రముఖలు తెలిపారు.