రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..? | NTR joining hands with Raghavendra Rao | Sakshi
Sakshi News home page

రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..?

Published Sat, Oct 8 2016 11:03 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..?

రాఘవేంద్రుడితో ఎన్టీఆర్..?

జనతా గ్యారేజ్ సినిమాతో తన కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, ఇంత వరకు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఎనౌన్స్ చేయలేదు. వక్కంత వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ చాలా రోజులుగా టాక్ వినిపిస్తున్నా.. ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాడట. ఆ తరువాత పూరి దర్శకత్వంలో మరోసారి ఎన్టీఆర్ సినిమా ఉంటుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓం నమోవేంకటేశాయ సినిమాను రూపొందిస్తున్న దర్శకేంద్రుడు రాబోయే రెండేళ్లలో ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా పౌరాణికం లేదా సోషియో ఫాంటసీ అయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు బాహుబలి తరహాలో ఈ సినిమాను కూడా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement