
అక్షిత్ శశికుమార్, కీర్తి కల్కరే హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ఓ మై లవ్. స్మైల్ శ్రీను దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని జి.సి.బి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. రామంజిని కన్నడ, తెలుగు భాషల్లో నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఓ మై లవ్" సినిమా క్వాలిటీ చాలా బాగుంది. ఈ చిత్రం తెలుగులో కూడా రావడం సంతోషంగా ఉంది.
టీజర్ చూస్తే శీను టేలెంట్ తో బ్యూటిఫుల్ యూత్ ఫుల్ లవ్ సబ్జెక్ట్ తీసుకుని చాలా అందంగా చిత్రీకరించారు'' అని పేర్కొన్నారు. కాగా దర్శకుడు స్మైల్ శ్రీను మాట్లాడుతూ టీజర్‌ను విడుదలను చేసిన రాఘవేంద్రరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment