Interesting And Real Life Facts About Pelli Sandadi Actress Sreeleela In Telugu - Sakshi
Sakshi News home page

Sreeleela: రాఘవేంద్రరావు వదిలిన మరో అందాల బాణం.. శ్రీలీల

Published Thu, Sep 30 2021 11:21 AM | Last Updated on Thu, Sep 30 2021 4:30 PM

Interesting Facts About Pelli SandaD Actress Sreeleela - Sakshi

టాలీవుడ్‌కి ఎందరో హీరోయిన్స్‌ని పరిచయం చేసిన గోల్డెన్‌ హ్యాండ్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది. తెరపై హీరోయిన్స్‌ని ఆయన చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేడు అనడంతో అతిశయోక్తి లేదు.

అలాంటి శతాధిక దర్శకుడు తన గోల్డెన్‌ హ్యాండ్‌తో తెలుగు తెరపైకి వదిలిన మరో అందాల బాణమే శ్రీలీల. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ చిత్రం ‘పెళ్లి సందD’తో తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఈ కన్నడ భామ. 

సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తోంది. 

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు. ట్రైలర్‌లో తన అందాలతో కవ్వించింది శ్రీలీల 

బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయే శ్రీలీల. మెడిసిన్ చ‌దువుతుంది.

పెళ్లి సందD కంటే ముందు కన్నడలో కొన్ని సినిమాలు చేసింది హీరోయిన్ శ్రీలీల. అక్కడ ఆమెకు మంచి గుర్తింపు ఉంది

తెలుగు సినిమాల అవ‌కాశాల కోసం చూస్తున్న త‌రుణంలో ‘పెళ్లిసందD’లో హీరోయిన్‌గా ఎంపిక చేశాడు రాఘవేంద్రరావు

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు ట్రైలర్‌లో తన అందాలతో కవ్వించింది లీల 

 తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే ఫేస్ అవ్వడంతో పాటు ఆమె మంచి అందం మరియు ప్రతిభ కలిగిన అమ్మాయి అంటూ రాఘవేంద్ర రావు నుండి కితాబు పొందింది. 

శ్రీలీల అందానికి టాలీవుడ్‌ కుర్రకారుతో పాటు దర్శక నిర్మాతలు ఫిదా అవుతున్నారు

పెళ్లి సందడి సినిమా తర్వాత ఈ చిన్నది.. తెలుగులో మరిన్ని అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే కుర్ర హీరోలు ఈ అమ్మడితో సంప్రదింపులు కూడా చేస్తున్నారట.

రవితేజ హీరోగా రూపొందబోతున్న త్రినాథరావు నక్కిన సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement