
‘‘ఆంధ్రుల అందగాడు శోభన్‌బాబు. దర్శక–నిర్మాతలకు ఆయన అనుకూలంగా ఉండేవారు. సహ నటీనటులతో సోదరభావంతో ఉండేవారు. ఎప్పడూ సాధారణ జీవితాన్ని గడిపేందుకే ప్రయత్నం చేసేవారు. స్థిరాస్తులను అందరూ కలిగి ఉండాలని కోరేవారు. పుట్టినరోజులు, జయంతి వేడుకల పేరిట అనవసర ఖర్చులు చేయవద్దని చెప్పేవారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని అంటుండేవారు’’ అని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. ప్రతిష్టాత్మక శోభన్‌బాబు అవార్డుల కార్యక్రమం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది.
అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శోభన్‌బాబు నటించిన పలు చిత్రాల సన్నివేశాలను ప్రదర్శించారు. పలు పాటలకు కళాకారులు నాట్యం చేసి అలరించారు. ఈ వేదికపై లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును నటుడు కృష్ణంరాజుకు అందజేశారు. పలువురు నటీనటులకు దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరావు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నటీమణులు సరిత, భానుప్రియ, జయచిత్రలతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment