Sobhanbabu
-
శోభన్‌బాబు ఆంధ్రుల అందగాడు
‘‘ఆంధ్రుల అందగాడు శోభన్‌బాబు. దర్శక–నిర్మాతలకు ఆయన అనుకూలంగా ఉండేవారు. సహ నటీనటులతో సోదరభావంతో ఉండేవారు. ఎప్పడూ సాధారణ జీవితాన్ని గడిపేందుకే ప్రయత్నం చేసేవారు. స్థిరాస్తులను అందరూ కలిగి ఉండాలని కోరేవారు. పుట్టినరోజులు, జయంతి వేడుకల పేరిట అనవసర ఖర్చులు చేయవద్దని చెప్పేవారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని అంటుండేవారు’’ అని సీనియర్ నటుడు కృష్ణంరాజు అన్నారు. ప్రతిష్టాత్మక శోభన్‌బాబు అవార్డుల కార్యక్రమం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శోభన్‌బాబు నటించిన పలు చిత్రాల సన్నివేశాలను ప్రదర్శించారు. పలు పాటలకు కళాకారులు నాట్యం చేసి అలరించారు. ఈ వేదికపై లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును నటుడు కృష్ణంరాజుకు అందజేశారు. పలువురు నటీనటులకు దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వనీదత్, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరావు చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నటీమణులు సరిత, భానుప్రియ, జయచిత్రలతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
ఒకరి జీవితం పండించి తను మాత్రం రాలిపోయే 'గోరింటాకు'
నాటి సినిమా సృష్టిలో ఏమీ ఆశించినవి కొన్ని ఉంటాయి. పైగా ఇవ్వడమే వాటి ధర్మమనుకుంటాయి. పూలు సువాసననిచ్చి వాడిపోతాయి. మబ్బులు చినుకులు రాల్చి కరిగిపోతాయి. ఏరు దప్పిక తీర్చి కదిలెళ్లిపోతుంది. పంట ఫలాన్ని ఇచ్చి లుప్తమైపోతుంది. పురుషుల విషయంలో కొందరు స్త్రీలు కూడా ఇలాగే ఉంటారు. వారి జీవితాన్ని నిస్వార్థంగా పండించి తాము మాత్రం నిశ్శబ్దంగా రాలిపోతారు. రాము (శోభన్‌బాబు) తన జీవితంలో ఇద్దరు స్త్రీలను అలాంటివాళ్లుగా చూశాడు. ఒకరు తల్లి (సావిత్రి). మరొకరు స్నేహితురాలు స్వప్న (సుజాత). తల్లికి భర్త వల్ల జీవితంలో ఎటువంటి సంతోషమూ లేదు. అతడు తాగుబోతు. వ్యసనపరుడు. ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుని బంగారం లాంటి ఇంటిని అలక్ష్యం చేసినవాడు. చివరకు ముక్కుపచ్చలారని కన్నకూతురు ఒక రోజు ముచ్చటపడి గోరింటాకు పెట్టుకుంటే అదే రోజున ఆ పిల్ల చావుకు కారణమవుతాడు. అయినా సరే తల్లి అతని బాగే కోరింది. భర్తలో మార్పే ఆశించింది. అతడి కోసం తన జీవితాన్ని గోరింటాకులా మార్చడానికి ప్రయత్నించింది. స్వప్న కూడా అంతే. మెడికల్ కాలేజీలో రాము క్లాస్మేట్. అతడి కాలేజీ ఫీజు ఆమే కట్టింది. అతడు హాస్టల్లో ఉండి అవస్థలు పడుతుంటే తన ఇంటికి తెచ్చి ఔట్‌హౌస్‌లో చోటు చూపించింది. బట్టలు ఉతకడానికి పని మనిషిని పెట్టింది. చెంబు ఇస్త్రీతో అవస్థలు పడుతుంటే కొత్త బట్టలు కొనిచ్చింది. అతడి పట్ల ఆమె మనసులో ఎంతో అనురాగం. ఆమె పట్ల కూడా అతడి మనసులో ఎంతో అనుబంధం. కాని వాళ్లు ఒకటి తలిస్తే స్వప్న తండ్రి మరొకటి తలిచాడు. అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు పెళ్లయ్యాక ఇంకా పెద్ద ఇంటి కోడలు కావాలని భావించాడు. ఇది రాముకు తెలిసింది. తన ప్రేమను వ్యక్తం చేయడానికి భయపడ్డాడు. అతడు భయపడటంతో ఆమె తెగువ చూపలేకపోయింది. మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రాము డాక్టర్ కావడంలో కీలకపాత్ర పోషించిన ఆమె అతణ్ణి వదులుకొని దూరం వెళ్లిపోయింది. కాని వెళ్లిన ఆమె సుఖంగా లేదు. పెళ్లి చేసుకున్నవాడు ఇది వరకే మరొకరికి తాళి కట్టి ఉన్నాడు. ఇది పెద్ద దెబ్బ. కాని ఆమె భీరువు కాదు. అతడి భరతం పట్టి తిరిగి వచ్చింది. కాని అప్పటికే రాము తనకు ఎదురు పడిన ఒక డిస్ట్రబ్డ్ పేషంట్ (వక్కలంక పద్మ)కు సన్నిహితం అయి ఉంటాడు. నిజమే కావచ్చు. కాని పెళ్లి పెటాకులై తిరిగి వచ్చిన స్వప్నను పెళ్లి చేసుకోవాల్సిన బాధ్యత అతడిపై ఉంది. చేసుకోమని కోరే హక్కు ఆమెకూ ఉంది. కాని ఆమె అలా చేయదు. రామును చేసుకుంటే అతడు సన్నిహితమైన అమ్మాయికి క్షోభ కలగవచ్చు. ప్రాణం కోల్పోవచ్చు. అందుకే స్వప్న తను ‘కుమారి’గానే ఉండిపోవడానికి నిశ్చయించుకుంటుంది. రాము జీవితం నుంచి శాశ్వతంగా అడ్డుతొలగిపోతుంది. అతని జీవితాన్ని అన్ని విధాల పండించి ఆమె మాత్రం విధి తరంగాలలో ఎక్కడో తప్పిపోయింది. 1979లో వచ్చిన ‘గోరింటాకు’ ఇప్పటికీ తెలుగు సినిమాల్లో క్లాసిక్‌గా నిలిచి ఉంది. నిర్మాత మురారి, కథకురాలు కె.రామలక్ష్మి, దర్శకుడు దాసరి నారాయణరావు, సంగీతకారుడు కె.వి. మహదేవన్... ఇంకా నటీనటులు అందరూ కలిసి ఆ సినిమాను తెలుగువారికి ప్రియమైన సినిమాగా మార్చారు. స్త్రీ కోరుకునేది పురుషుడి అనురాగం. అతడు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా వంచన చేసినా ఆమె సహనంగా అతడిని ఆదరిస్తుంది. మార్పు కోరుకుంటుంది. అతడి బాగు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతుంది. స్త్రీ తాలూకు లోతైన ఈ భారతీయ స్వభావాన్ని చూపడం వల్లే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. అయితే అదే సమయంలో స్త్రీ ఎదురు తిరిగితే ఏమవుతుందో స్వప్న పాత్ర ద్వారా చూపిస్తారు. తనను మోసం చేసి తాళి కట్టిన దొంగ మొగడి ముఖాన తాళి తెంచి విసిరి కొట్టే సన్నివేశం గొప్ప ఇంపాక్ట్ చూపుతుంది. శోభన్‌బాబు, సుజాత ఈ సినిమాలో ఎంతో ముచ్చటగా అందంగా కనిపిస్తారు. నటిస్తారు. అలనాటి సూపర్‌స్టార్ సావిత్రి కథకు నిండుదనం తెస్తుంది. కథకు పెద్ద రిలీఫ్‌గా రమాప్రభ–చలం జంట. ఉత్తరాంధ్ర యాసలో వాళ్లిద్దరూ ఆకట్టుకుంటాడు. ‘ఏటంటావంటే నానేటంటాను... నువ్వేటంటే నానూ అదే అంటాను’ అని రమాప్రభ విజృంభిస్తుంది. దేవులపల్లి – గోరింటా పూచింది కొమ్మా లేకుండా, వేటూరి– కొమ్మకొమ్మకో సన్నాయి, ఆత్రేయ– చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది, శ్రీశ్రీ– ఇలాగ వచ్చి అలాగ తెచ్చి వంటి పాటలు ఈ సినిమాలో మహదేవన్ వల్ల నిలిచి వెలిగాయి. వెలుగుతున్నాయి. విశాఖ అందాలు, ఔట్‌డోర్‌లో తీసిన సన్నివేశాలు ఇప్పుడు చూసినా ఫ్రెష్‌గా ఉంటాయి.దాసరి సినిమాలు చాలా ఉండొచ్చు. కాని ఇది ప్రత్యేకం. ఎంతో బాగా పండి ఎప్పటికీ రాలిపోని గోరింటాకు ఇది. కూనిరాగం వస్తోంది... ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం... మీరూ కాడుకోండి. – కె -
జాతీయ తైక్వాండో పోటీలకు లవకుమార్ ఎంపిక
కల్లూరు: జాతీయ తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన వరిశెట్టి లవకుమార్ ఎంపికైనట్లు జిల్లా తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన 36వ రాష్ట్ర స్థాయి జూనియర్స్ తైక్వాండో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబచర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం ఆనందపూర్సాహెబ్లో నిర్వహిస్తున్నట్లు 36వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో లవకుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. -
‘షో’భన్ బాబు
♦ పాటలు, డ్యాన్స్, మిమిక్రీ, యాంకరింగ్‌లో ప్రతిభ ♦ రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రదర్శనలు.. పలువురి ప్రశంసలు పాటలు పాడటం.. పేరడీగా మలచడం.. ధ్వన్యనుకరణ చేయడం.. ఇతరుల డ్యాన్స్‌ను అనుకరించడం.. యాంకరింగ్‌తో ఆకట్టుకోవడం.. షార్ట్ ఫిలింస్‌లో నటనా కౌశలాన్ని ప్రదర్శించడం.. ఇలా వివిధ విభాగాల్లో ప్రతిభ చాటుతున్నాడు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో బహుమతులు దక్కించుకోవడంతోపాటు ప్రముఖుల మెప్పు పొందుతున్నాడు నగరానికి చెందిన శోభన్‌బాబు. వేదికలపై నిత్యం ప్రదర్శనలతో అలరించే ఆయన అందరి దృష్టిలో ‘షో’భన్బాబుగా మారాడు. - ఖమ్మం కల్చరల్ నగరంలోని ఎన్నెస్పీ కాలనీకి చెందిన శోభన్‌బాబు ప్రైవేటు ఉద్యోగి. ప్రవృత్తిగా కళారంగాన్ని ఎంచుకున్నాడు. 1996లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కళారంగంలో రాణిస్తున్నాడు. అప్పట్లోనే జిల్లాస్థాయి పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచి.. ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. సినిమా పాటలకే ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా జానపద పాటలు ఎక్కువగా పాడుతూ పల్లె సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించడం అలవర్చుకున్నాడు. క్రమక్రమంగా జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అంతేకాక డ్యాన్స్‌లు చేస్తూ.. ఇతరులను అనుకరించడం అలవర్చుకున్నాడు. డ్యాన్స్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, రాజశేఖర్, బ్రహ్మానందం, ఆర్.నారాయణ మూర్తి, శోభన్‌బాబు తదితర హీరోలను అనుకరించడంలో నేర్పు సంపాదించాడు. ఖమ్మంకు చెందిన మొగిలి దర్శకుడిగా గతేడాది విడుదల అయిన ‘ఒక్కడితో మొదలైంది’ అనే సినిమాలో హీరో సుమన్ పక్కన ఓ పాత్రలో నటించాడు. వేదికలపై యాంకరింగ్ చేస్తూ అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంటాడు. ఒకే వేదికపై యాంకరింగ్‌తోపాటు పాట పాడుతూ.. డ్యాన్స్ చేస్తూ.. మిమిక్రీ చేయడం ఇతడి అదనపు ప్రత్యేకతలు. పలు టీవీ సీరియల్స్, లఘు చిత్రాల్లో వివిధ పాత్రల్లో నటించిన అనుభవం ఉంది. అతడి ఉత్తమ నటనకు పలువురిచే ప్రశంసలు అందుకున్నాడు. సినిమా పాటలను యువతకు నచ్చేలా పేరడీ పాటలుగా మలిచి పాడటంలో సిద్ధహస్తుడు. అవార్డులు, ప్రశంసలు కొన్ని... ♦ 2001లో విజయవాడ రాష్ట్రస్థాయి నాటికల పోటీల్లో సిద్ధార్థ అకాడమీలో ‘పిచ్చి పెళ్లికొడుకుగా’ నవ్వించి..ప్రథమ బహుమతి పొందాడు. ♦ 2002లో హైదరాబాద్‌లో జరిగిన పాటల పోటీల్లో ప్రథమ బహుమతి ♦ 2002లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఫెస్టివల్ పాటల పోటీల్లో పాల్గొన్నాడు ♦ 2006లో జోనా మెమోరియల్ రాష్ట్రస్థాయి పాటల పోటీల్లో ప్రథమ బహుమతి. ♦ 2007లో వరంగల్ రాష్ట్రస్థాయి యూత్ ఫెస్టివల్లో మిమిక్రీ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించాడు. ♦ 2008లో తెలుగు భాషా దినోత్సవంలో వక్తృత్వ పోటీల్లో ద్వితీయ బహుమతి పొందాడు. వీటితోపాటు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్, సునీల్, సుమన్, రఘు కుంచె, డెరైక్టర్ బి.గోపాల్ చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నాడు. -
చీకటినీడలు
ఈ ప్రపంచంలో కాంతినిచ్చేది ప్రేమ. చీకటిని తొలగించేది త్యాగం. నీడగా నిలబడేది బంధం. కాంతి లేనప్పుడు చీకటి కనబడుతుంది. కాంతి ఉన్నప్పుడు నీడ కనబడుతుంది. కానీ చీకటిలో కూడా నీడ ఉంటుంది అంటే నమ్ముతారా? కనబడదు కాబట్టి నమ్మరా?! అజ్ఞాతం అనే నీడలో ఉన్నంత వెలుగు కోటి దీపాల్లో కూడా ఉండదని ఈ సినిమా చెబుతుంది. వెలుగు కిందైనా కనబడతానని నీడకు స్వార్థం ఉండొచ్చు. కానీ చీకటి పక్కన నీడ కనపడాలని అనుకోదు. నీడ అనే కుంచెతో త్యాగమన్న చీకటిని వెలుగులా చిత్రీకరించారు. వెలుగుల కన్నీటితో కడిగే ఈ జీవనజ్యోతిని మళ్లీ చూడాలి. మానసిక చికిత్సాలయం. ఆ ఆలయంలో ఉంది వాణిశ్రీ. బిడ్డను పోగొట్టుకుని మతి స్థిమితం తప్పిన అమ్మ ఆమె. సొంత బిడ్డ కాకపోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువే. ఇరవై ఏళ్లుగా ఆ బిడ్డను మరువలేక, బిడ్డ ఇంకా బతికే ఉన్నాడన్న భ్రమలో ఉంది. దోసిళ్లలోని బొమ్మ బిడ్డను కనురెప్పల్లో పెట్టుకుని క్షణక్షణం మురిసిపోతోంది. చిన్న చప్పుడైంది. ‘ష్... ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు..’ అంది ఆ అమ్మ. శోభన్‌బాబు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెకు పండ్లూ ఫలాలు ఇచ్చాడు. బొమ్మలూ ఇచ్చాడు. అవీ ఆమె కోసమే. బిడ్డ ఉన్నాడు అనుకుంటున్న భార్య కోసం ఆ బొమ్మలు తెచ్చాడు. ఈ భార్యాభర్తలు... చెట్టంత బిడ్డలు ఉండవలసిన వయసులో ఉన్నవారు. వాణిశ్రీ బిడ్డ కోసం బతుకుతుంటే, శోభన్‌బాబు వాణిశ్రీ కోసం బతుకుతున్నాడు. ‘అవునూ మీరెవరు? రోజూ నాకు పలహారాలు, బాబుకు బొమ్మలు తెస్తారు! నేను మీకేమౌతాను?’ అంది వాణిశ్రీ. శోభన్‌బాబు ఆవేదనగా నవ్వాడు. ‘నువ్వా? నాకా? హు... గుడికి దీపం ఏమౌతుంది? దీపానికి వెలుగు ఏమౌతుంది? అదే నువ్వూ నాకు అవుతావు’ అన్నాడు. ఆమెకేం అర్థం కాలేదు. ‘పిల్లాడి’ ధ్యాసలో పడిపోయింది. అమెరికా వెళ్లేందుకు సిద్ధమౌతోంది శోభ. శోభ అంటే చిన్న వాణిశ్రీ. మతిస్థిమితం తప్పిన పెద్ద వాణిశ్రీ కూతురు ఆమె. ఆ విషయం ఆమెకు తెలీదు. తను బాబాయి అనుకుంటున్న శోభన్‌బాబే తన తండ్రి అని కూడా ఆమె తెలీదు. పైగా ఆయనంటే అయిష్టం. చిన్న వాణిశ్రీకి ఓ కొడుకు. వాడంటే ఆమెకు పంచప్రాణాలు. వాణ్ణి విడిచి క్షణం కూడా ఉండలేదు. ‘అన్నట్లు అమెరికా వెళ్లే ముందు ఒకసారి వాసు (సత్యనారాయణ తమ్ముడు శోభన్‌బాబు) దగ్గరికి వెళ్లాలి మనం’ అన్నాడు సత్యనారాయణ. చి. వాణిశ్రీ చికాకు పడింది. తప్పనిసరై అమ్మ, నాన్నలతో కలిసి బిడ్డను తీసుకుని పొరుగూరిలో ఉన్న ‘బాబాయ్’ ఇంటికి వెళ్లింది. (సినిమాలో అమెరికా అల్లుడి మాట వినిపిస్తుంది తప్ప, మనిషి కనిపించడు. ఎందుకంటే ఇది ఒకట్రెండు రోజుల్లో ముగిసే కథ. మధ్యలోనిది అంతా ఫ్లాష్‌బ్యాక్). రాత్రి బాగా పొద్దు పోయింది. శోభన్‌బాబు తాగుతున్నాడు. ‘లక్ష్మి ఎలా ఉంది?’ అడిగాడు సత్యనారాయణ. లక్ష్మి అంటే మానసిక చికిత్సాలయంలో ఉన్న వాణిశ్రీ. ‘కన్న కూతురు భర్త దగ్గరకు అమెరికా వెళుతుంటే మనసారా ఆశీర్వదించలేని నికృష్ణపు బతుకు బతుకుతోంది’ అన్నాడు శోభన్‌బాబు బాధగా. అప్పుడే అటుగా వచ్చిన చి. వాణిశ్రీ ఈ మాటను వింది. పరుగున శుభ దగ్గరికి వెళ్లింది. ‘మమ్మీ మమ్మీ’ ‘ఏమిటమ్మా...’ ‘నేనెవరి కూతుర్ని, నిజం చెప్పు’. ‘ఏమిటా అర్థంలేని మాటలు? కలవరిస్తున్నావా? ఏంటమ్మా నీకెందుకా సందేహం వచ్చింది?’ ‘ఎందుకా? తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక. (శోభా అని తల్లి అరుస్తుంది) ‘చెప్పకపోతే నా మీద ఒట్టే. ఆ లక్ష్మి ఎవరు? నేను ఎవరి బిడ్డను. నిజం చెప్పండి. మాట్లాడరేం’ అంది చి.వాణిశ్రీ. ‘కన్నతండ్రిని ఎదురుగా పెట్టుకుని ఏమిటా పిచ్చి ప్రశ్నలు’ అన్నాడు శోభన్‌బాబు సత్యనారాయణను చూపిస్తూ. ‘‘బాబాయ్ నేనేం పసిపాపను కాదు, మాటలతో మరిపించడానికి. నిజం చెప్పండి. ఎందుకలా కంగారు పడుతున్నారు? మాట్లాడరే.. నా పుట్టుక అంత అపవిత్రమైనదా? నా తల్లి... కడుపున పుట్టిన బిడ్డను కన్న కూతురు అని చెప్పుకోలేనంత పాపిష్టిదా? పచ్చిగా బతుకుతున్న కులహీనురాలా? కులటా?’ ‘శోభా’ పెద్దగా అరిచాడు శోభన్‌బాబు. ‘నీ తల్లి కులట కాదమ్మా. కుల దైవం. పతిత కాదమ్మా దేవత. నా జీవన జ్యోతి. నేనింకా బతికున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలకూట విషం నా కడుపులో దాచుకుని కుమిలిపోతున్నాను అంటే నీ కోసం అమ్మా నీ కోసం. అవునమ్మా నువ్వు, నాకు లక్ష్మికి పవిత్ర మాంగల్యానుబంధానికి ఫలితంగా పుట్టిన బిడ్డవు’. ‘అవునమ్మా... వాసు నీ కన్న తండ్రి’ అన్నాడు సత్యనారాయణ. చిన్న వాణిశ్రీ ఖిన్నురాలైంది. ‘అయితే నేను మీ దగ్గర ఎందుకు పెరిగాను’ అని అడిగింది. ‘అదంతా ఒక పెద్ద కథమ్మా. ఏ కవీ కల్పించలేని యదార్థ జీవితం’ అన్నాడు శోభన్‌బాబు. (ఇక్కడ ఫ్లాష్ బాక్ మొదలౌతుంది). అల్లు రామలింగయ్య టీచర్. సత్యనారాయణ పెద్ద కొడుకు. శోభన్‌బాబు చిన్న కొడుకు. పెద్దకొడుక్కి పెళ్లయిపోయింది. కోడలు శుభ ఉద్యోగం చేస్తోంది వాళ్లకో బిడ్డ. ఇల్లు పీకి పందిరేసే వయసు. ఆ ఇంట్లోకి రెండో కోడలుగా అడుగు పెట్టింది. వాణిశ్రీ. ఇంట్లో అందరి అభిమానాన్ని చూరగొంది. ఇంటెడు పని చేస్తుంది. బావగారి కొడుకు ఆలనా పాలనా తనే తీసుకుంది. తోడికోడలు ఉద్యోగి కదా అందుకు. శుభకు ఒకడే కొడుకు. ఆపరేషన్ కూడా అయింది. ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందుకే ఆ ఇంట్లో వాడు స్పెషల్. ఇప్పుడు వాణిశ్రీ కోడలుగా వచ్చాక వాడు ఇంకా స్పెషల్ అయ్యాడు. వాణిశ్రీ ఎప్పుడూ ఆ పిల్లాడిని వెంటేసుని తిరుగుతుంది. భర్త పనిచేసే ఆఫీసుకు కూడా అలాగే వెళుతుంది. వాడంటే అంత ఇష్టం. రోజులు గడుస్తుంటాయి. శుభ కొడుకు వాణిశ్రీకి బాగా మాలిమి అవుతాడు. అమ్మా అమ్మా అంటూ తిరుగుతాడు. అసలు అమ్మను పట్టించుకోడు. పిల్లాడి విషయంలో వాణిశ్రీని తప్పు పడుతుంది శుభ ఓరోజు భర్త దగ్గర. ‘నూరేళ్లు సలక్షణంగా బతికవలసిన నా బాబు... ఆ గొడ్రాలి చేతిలో పెరిగి అల్పాయుష్కుడవడం నేను సహించలేను’ అని గట్టిగా అరిచింది శుభ. ఆ అరుపు వాణిశ్రీకి వినిపించింది. కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘నేను గొడ్రాలినా’’ అని శోభన్ని అడిగింది. ‘పిల్లాపాపల్లేని వాళ్లు బాబుని పెంచకూడదా?’ అని అడిగింది. శోభన్, వాణిశ్రీని అక్కున చేర్చుకున్నాడు. ‘లక్ష్మీ... ఎండిపోయిన చెట్లైనా నీ చేత్తో నీళ్లు చిలకరిస్తే చిగురించి మూడు పావులు, ఆరుకాయలుగా రాలేదా... అలాంటి చల్లటి మనసుతో నువ్వు పెంచుతున్న బాబు అల్పాయుష్కుడు ఎలా అవుతాడు?’ అని అనునయించాడు. ఆ రాత్రి ఇద్దరూ ఒకటవుతారు.... చాలాకాలం తర్వాత. ఆ మర్నాడే బెంగుళూరు వెళ్లిపోతాడు శోభన్. ఇక్కడ వాణిశ్రీకి గుడికి బయల్దేరింది. నానమ్మని అడిగి బాబు (శుభ కొడుకు) కూడా బయటికి వెళ్తాడు. గుడి దగ్గర రద్దీగా ఉంది. అమ్మను వెతుక్కుంటూ వెనకాలే వెళ్లాడు. అంతా అక్కడ రథం లాగుతున్నారు. అక్కడ వాడు వాణిశ్రీని చూసి అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు. వాణిశ్రీ కూడా వాడిని చూసింది. ‘బాబూ బాబూ అక్కడే ఉండు’ అని దగ్గరకు వస్తుంటుంది. ఆలోపే వాడు రథం చక్రాల కింద పడి చచ్చిపోతాడు. సినిమాకు ఇది టర్నింగ్ పాయింట్. వాణిశ్రీకి ఎప్పుడూ బాబే గుర్తుకు వస్తుంటాడు. ఎక్కడ చూసినా వాడే కనిపిస్తుంటాడు! ఎవ ర్ని చూసినా వాడే అనుకుంటుంది. చివరికి వాణిశ్రీ మతి స్థిమితం తప్పి ఎటో వెళ్లిపోతుంది. పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. వెతికి ఇంటికి తెస్తారు. ‘మెంటల్లీ షాక్డ్. గర్భవతి కూడా. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని’ చెప్తాడు డాక్టర్. నెలలు నిండుతాయి. ఆడపిల్ల పుడుతుంది. ఆమే... చిన్న వాణిశ్రీ. ‘ఈ పరిస్థితిల్లో బిడ్డను ఆమె పెంచకూడదు. ఆ పసిపాప భారాన్ని ఎవరికైనా అప్పగించడం మంచిది. అన్నయ్యా... పోయిన మీ బిడ్డను మళ్లీ తెచ్చిచ్చే శక్తి నాకు లేదు. తల్లి ఉండీ లేని ఈ బిడ్డను మీ బిడ్డలాగే పెంచుకోగలరా’ అని అడుగుతాడు శోభన్. అలా సత్యనారాయణ, శుభ... చి.వాణిశ్రీని తమ బిడ్డలా అక్కున చేర్చుకుంటారు. అక్కడ మానసిక చికిత్సాలయంలో పెద్ద వాణిశ్రీ, ఇక్కడ అసలు తల్లిదండ్రులు కాని సత్యనారాయణ, శుభల దగ్గర చిన్న వాణిశ్రీ ఉంటారు. శోభన్ రోజూ వెళ్లి చికిత్సాలయంలో భార్యను చూసి వస్తుంటాడు. ఇదీ ఫ్లాష్ బ్యాక్. అంతా విన్నాక... ‘నేను వెంటనే మా అమ్మను చూడాలి’ అంటుంది చి. వాణిశ్రీ. ‘నీకేమైనా పిచ్చిపట్టిందా? నీకీ విషయం తెలియకూడదనే అమ్మా మేము ఇంతకాలం తాపత్రయ పడింది’ అన్నాడు సత్యనారాయణ. ‘చూడాలి. చూసి తీరాలి’ అంటుంది. వెళుతుంది. అమ్మను చూస్తుంది. బొమ్మ బిడ్డను ఎత్తుకుని పాడుతుంటుంది పెద్ద వాణిశ్రీ. అదే పాట... ముద్దుల మా బాబు...పాట. చి. వాణిశ్రీ ఏడుస్తుంది. అమ్మ దగ్గరికి తన కొడుకును పంపుదామనుకుంటుంది. పెద్ద వాణిశ్రీలా వేషం చేసుకుని ఆ వేషానికి వాడిని అలవాటు చేస్తుంది. లాస్ట్ సీన్: మెంటల్ హాస్పిటల్లో వాణిశ్రీని ఏడిపిస్తుంటారు మిగతా రోగులు. చర్చిలో కూర్చొని ఏడుస్తుంటుంది. కూతురు వాణిశ్రీ వస్తుంది. ‘ఎందుకేడుస్తున్నావ్’ అని అడుగుతుంది తల్లిని. ‘నా బాబు కనిపించడం లేదు’ ‘ఎలా ఉంటాడు?’ చెప్తుంది. ‘ఓహో... మీ వారు తీసుకెళ్లారన్న మాట. రోజూ వచ్చి మీకు పండ్లు పలహారాలు ఇచ్చే మీవారు తీసుకెళ్లారు. మీకు మీ వారిని, మీ బాబుని చూపిస్తాను. మరి నేనడిగింది ఇస్తారా?’ అంటుంది చిన్న వాణిశ్రీ. ‘నా బిడ్డలాంటి దానివి ఏమడిగినా ఇస్తాను. అడుగు’ అంటుంది. కూతురు వాణిశ్రీ ఏడుస్తుంది. ‘అమ్మా అమ్మా’ అని ఏడుస్తుంది. ‘మీ అమ్మ లేదా ఎందుకేడుస్తున్నావ్’ అంటుంది. ‘ఉంది నా మనసులో, నా చుట్టూ, నా ఎదురుగా ఉంది’ అంటుంది. ఆశీర్వదించమంటుంది. శోభన్‌బాబు, బాబు పచ్చికలో ఆడుకుంటుంటుంటే తీసుకెళ్లి ‘అడుగోనమ్మా మీ బాబు అని తన బాబుని చూపెడుతుంది. పెద్ద వాణిశ్రీకి గతం గుర్తుకొస్తుంది. ‘అమ్మా’ అని పిల్లాడు ఆమె దగ్గరికి వెళతాడు. శోభన్ కూతురివైపు ఆశ్చర్యంగా చూస్తాడు. ఎంత త్యాగం చేశావమ్మా... అంటాడు. ‘త్యాగం కాదు.. కన్నబిడ్డగా నా రుణం తీర్చుకుంటున్నాను’ అంటుంది. తన బిడ్డను, తన తల్లి దగ్గర వదిలి చి. వాణిశ్రీ వెళ్లిపోతుంది. ఇదీ కథ. మళ్లీ చూడండి రామ్ ఎడిటర్, ఫీచర్స్