
తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవం సందర్భంగా మే4 వ తేదీన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెలుగు చలన చిత్ర దర్శకుల సంక్షేమం కోసం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకుందాం అని తీర్మానించారు. ట్రస్ట్ ద్వారా సంఘ సభ్యులలో ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నవారికి ఆరోగ్య , విద్య మరియు కుటుంబ అవసరాలకి సహాయం చేసే విధంగా ఒక నిధి ని ఏర్పాటు చేసుకుని, దాని ద్వారా వచ్చే వడ్డీ తో అర్హులైన వారికి తోడ్పాటు ఇద్దాం అని నిర్ణయించారు.
ఈ ట్రస్ట్ కోసం దర్శకుడు రాజమౌళి 50 లక్షలు, రాఘవేంద్ర రావు10 లక్షలు , నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా15 లక్షలు ప్రకటించారు. ట్రస్ట్ ఆలోచనని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి 25 లక్షలు ప్రకటించారు.ఈ నెల 24న తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ పేరిట రిజిస్టర్ అయిన ఈ ట్రస్ట్‌కు రాఘవేంద్ర రావు గారు చైర్మన్ గా, N శంకర్ (మేనేజింగ్ ట్రస్టీ)గా సేవలందించనున్నారు.
వీరితో పాటు వి వి వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, మెహెర్ రమేష్, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్రసాద్, కాశీ, బి.వి.ఎస్.రవి ట్రస్టీలు గా టీఎఫ్‌డీటీ (TFDT) ఆవిర్భావం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment