
అన్నమయ్య సినిమా తీసినందుకే...
తిరుమల : అన్నమయ్య చిత్రాన్ని తీసినందుకే సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి తనకు టీటీడీ ధర్మకర్తల మండలిలో అవకాశం కల్పించాడని ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పేర్కొన్నారు. దీన్ని బోర్డు పదవిలా కాకుండా స్వామి ప్రసాదంలా భావిస్తానని చెప్పారు.
మంగళవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటానని అన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందించి మనన్నలు పొందుతానన్నారు.