
ఆ ధైర్యం మా తారక్ కి ఉంది...
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ప్రశంసలతో ముంచెత్తారు. ‘జై లవ కుశ’ టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్స్‌కు ఆయన ఫిదా అయిపోయారు. ‘ఇలాంటి పాత్రలు చేయాలన్నా ధ ధ.. ధైర్యం కావాలి..మా తారక్ కి ఉంది. నేనూ ఎదురు చూస్తున్నా ఆ ధైర్యాన్ని తెర మీద చూడడానికి’ అంటూ రాఘవేంద్రరావు ట్విట్ చేశారు.
కాగా ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశ టీజర్ గురువారం రిలీజైన విషయం తెలిసిందే. ఆ టీజర్‌లో ‘‘ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దద్ద.. ధైర్యం ఉండాల... ఉందా’’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ‘జై’ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ నత్తి ఉన్నవాడిలా మాట్లాడటం.. డైలాగులు చెప్పడంలో ఎన్టీఆర్ సూపర్ అని మరోసారి నిరూపించుకున్నాడు.
బాబీ దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జై, లవ, కుశ అనే మూడు విభిన్నమైన పాత్రల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. రాశిఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.