
దద్ద.. ధైర్యం ఉండాల..!
.అవును ఎన్టీఆర్ ఇలానే నత్తినత్తిగా డైలాగ్స్ చెబుతున్నారు. నమ్మకం కుదరకపోతే ‘జై లవ కుశ’ టీజర్ చూస్తే అర్థమవుతుంది.
...అవును ఎన్టీఆర్ ఇలానే నత్తినత్తిగా డైలాగ్స్ చెబుతున్నారు. నమ్మకం కుదరకపోతే ‘జై లవ కుశ’ టీజర్ చూస్తే అర్థమవుతుంది. గురువారం రిలీజైన టీజర్‌లో ‘‘ఆ రావణున్ని సంపాలంటే సముద్రం దాటాల... ఈ రావణున్ని సంపాలంటే సముద్రం అంత దద్ద.. ధైర్యం ఉండాల... ఉందా’’ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ‘జై’ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ నత్తి ఉన్నవాడిలా మాట్లాడటం.. డైలాగులు చెప్పడంలో ఎన్టీఆర్ సూపర్ అని మరోసారి నిరూపితమైంది. కె.ఎస్ రవీంద్ర దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.