
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతోన్న సినిమా అరవింద సమేత. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. జై లవకుశ లాంటి హిట్ తరువాత త్రివిక్రమ్‌తో చేస్తోన్న ఈ సినిమాపై అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నుట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోందట. మరి ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ అభిమానులకు పండుగే. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment