
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి యార్ల గడ్డ రాఘవేంద్రరావు రాసిన ‘పచ్చి కడుపు వాసన’ కవిత్వం 34వ ‘ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు–2021’కు ఎంపికైంది. యార్లగడ్డ కలం నుంచి వచ్చిన ఆరో సంపుటి ‘పచ్చి కడుపు వాసన’. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాఘవేంద్రరావు సీనియర్ జర్నలిస్టు. 13 ఏళ్లుగా ఓ పత్రిక జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ అవార్డు న్యాయ నిర్ణేతలుగా కె. శివారెడ్డి, శీలా సుభద్రాదేవి, దర్భశయనం శ్రీనివాసాచార్య వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment