నేనైతే తిరిగి విసురుతా! | Amy Jackson Supports Taapsee About Raghavendra Rao | Sakshi
Sakshi News home page

నేనైతే తిరిగి విసురుతా!

Published Wed, Aug 2 2017 2:54 AM | Last Updated on Mon, Aug 13 2018 3:04 PM

నేనైతే తిరిగి విసురుతా! - Sakshi

నేనైతే తిరిగి విసురుతా!

అదే నేనైతే తిరిగి కొడతానంటోంది ఎమీజాక్సన్‌. ఈ ఇంగ్లీష్‌ భామకిప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లలో అవకాశాలు లేవు.  ఒక ఇంగ్లీష్‌ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. దక్షిణాదిలో 2.ఓ చిత్ర విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఎమీ అవకాశాల కోసం ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్నంలో పడింది. ఆ మధ్య నటి తాప్సీ దక్షిణాదిలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌లో మకాం పెట్టి దక్షిణాది సినిమా వారిపై ఆరోపణల దాడి మొదలెట్టింది.

దక్షిణాది చిత్రాల్లో చిత్రవధకు గురయ్యానని, ఒక దర్శకుడు పాటల సన్నివేశాల్లో బొడ్డుపై కొబ్బరిచిప్పలు వేశారని, ఆయనకు అదేం ఆనందమో అంటూ వెటకారంగా మాట్లాడింది. ఆమెకు టాలీవుడ్‌లో అవకాశం కల్పించిన ప్రముఖ దర్శకుడినే తాప్సీ అలా ఎగతాళి చేసింది. తరువాత క్షమాపణ చెప్పిందనుకోండి. తాప్సీకి మద్దతుగా నిలిచిన నటి ఎమీజాక్సన్‌ అలాంటి సంఘటనలు నిజంగా దారుణం అని పేర్కొంది. అలా తనపై ఎవరైనా చేస్తే అదే కొబ్బరి చిప్పను వారిపై విసురుతానని ఘాటుగా బదులిచ్చింది.

అదృష్టవశాత్తు తానిప్పటివరకూ మంచి దర్శకుల చిత్రాల్లోనే నటించానని పేర్కొంది. అదే విధంగా అందరు హీరోయిన్లకు అలా జరగదని, దయ చేసి అలాంటి బాధాకరమైన చర్యలకు పాల్పడరాదని ఎమీ ఒక భేటీలో పేర్కొంది. ఇలా ఈ అమ్మడు తనకు సంబంధం లేని విషయాలతో ఫ్రీ పబ్లిసిటీ పొందాలని చూస్తున్నట్లుంది కదూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement