వనపర్తి,న్యూస్‌లైన్: ఈ నెల 2న జరిగిన వీఆర్వో పరీక్షల్లో జిల్లాలోని పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లికి చెందిన అబ్బ రాఘవేందర్ రెడ్డి జిల్లా టాపర్‌గా నిలిచారు. అతను ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. ఇతని అన్న గణపతిరెడ్డి ఎక్సైజ్ శాఖ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. రాఘవేందర్ రెడ్డి శనివారం వనపర్తిలో ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ తన లక్ష్యం గ్రూప్-1 పరీక్ష రాసి ర్యాంకు సాధించడమని తెలిపారు.
కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు సంబంధించి వీఆర్వో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థుల మెరిట్ జా బితాను శనివారం రాత్రి డీఆర్వో రాంకిషన్ తన చాంబర్‌లో విడుదల చేశారు. ఈఫలితాల్లో టాప్ వన్‌గా 97మార్కులను ముగ్గురు అభ్యర్థులు సాధించారు. అయితే ముగ్గురిలో వయసును పరిగణల్లోకి తీసుకొని ఎక్కువ వయసున్న రాఘవేందర్ రెడ్డిని జిల్లా టాపర్‌గా ఏపీపీఎస్సీ ప్రకటిం చింది. రాఘవేందర్‌రెడ్డితోపాటు ఈశప్ప, కోడేర్‌కు చెందిన మరో అభ్యర్థి టాపర్ల స్థానంలోనే రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక ఈసారి ఓపెన్ కేటగి రిలో పురుషులు ప్రతిభను కనబర్చారు. ఓపెన్ కేటగిరి కోటా విషయానికొస్తే టాప్ టెన్‌లో ఇద్దరు మహిళలు మాత్రమే ఎంపికయ్యారు. ఇక మెరిట్ సాధించిన 500 మంది జాబితాను పరిశీలిస్తే కేవలం 26 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అం టే వీరికి కేటాయించిన 33పోస్ట్‌లకు సరి పడా ఎంపిక కాలేదని తెలుస్తోంది. జిల్లా లో ఖాళీగా ఉన్న 103 వీఆర్వొ పోస్ట్‌లకు గాను 80,674మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. పరీక్షల్లో మాత్రం 71,302మంది మాత్రమే పాల్గొన్నారు. అభ్యర్థులందరు చూసుకునేలా వారు సాధించిన మార్కులను విడుదల చేశా రు. 97మార్కులను ముగ్గురు, 96మార్కులను ఐదుగురు, 95మార్కులను ఏడుగు రు, 94మార్కుల్ని 14మంది, 93మార్కు లు 20కి పైగా అభ్యర్థులు సాధించారు.
వీఆర్‌ఏ టాపర్‌గా బుక్కతిమ్మప్ప
జిల్లాలో ఖాళీగా ఉన్న 94 వీఆర్‌ఏ పోస్ట్‌లకు సంబంధించి జిల్లాకు పంపించిన ఫలితాల్లో టాపర్‌గా బుక్కతిమ్మప్ప నిలి చినట్లు సమాచారం. ఈఫలితాలు జిల్లా కు వచ్చిన ట్రిబ్యునల్ కోర్టు స్టేను జారీ చేయడంతో అధికారులు విడుదల చేయకుండా నిలిపేశారు. స్టేను పరిష్కరించాకే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటిస్తున్నారు.
నేడు తుదిజాబితా....
జిల్లాకు వచ్చిన మెరిట్ జాబితాను రోస్టర్ ప్రకారం మెరిట్‌సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో అధికారులు బిజీగా నిమగ్నమయ్యారు. శనివారం అర్ధరాత్రి వరకు ఈకసరత్తును పూర్తి చేసుకొని ఆదివారం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులందరికి వెంటనే సమాచారం ఇచ్చి ఈనెల 25లోగా వారి సర్టిఫికెట్లను తనిఖీ కార్యక్రమాన్ని పూర్తిచేస్తామన్నారు. అనంతరం 28న వారికి నియామక ఉత్తర్వులను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చం దర్‌రావు, ఈసెక్షన్ ఇన్‌చార్జి తహశీల్దార్ బాలచందర్‌తోపాటు, సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వీఆర్వో జిల్లా టాపర్ రాఘవేందర్ రెడ్డి
Published Sun, Feb 23 2014 4:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM
Advertisement
Advertisement