VRO VRA exam
-
వీఆర్వో జిల్లా టాపర్ రాఘవేందర్ రెడ్డి
వనపర్తి,న్యూస్‌లైన్: ఈ నెల 2న జరిగిన వీఆర్వో పరీక్షల్లో జిల్లాలోని పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లికి చెందిన అబ్బ రాఘవేందర్ రెడ్డి జిల్లా టాపర్‌గా నిలిచారు. అతను ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు. ఇతని అన్న గణపతిరెడ్డి ఎక్సైజ్ శాఖ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. రాఘవేందర్ రెడ్డి శనివారం వనపర్తిలో ‘న్యూస్‌లైన్’ తో మాట్లాడుతూ తన లక్ష్యం గ్రూప్-1 పరీక్ష రాసి ర్యాంకు సాధించడమని తెలిపారు. కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు సంబంధించి వీఆర్వో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థుల మెరిట్ జా బితాను శనివారం రాత్రి డీఆర్వో రాంకిషన్ తన చాంబర్లో విడుదల చేశారు. ఈఫలితాల్లో టాప్ వన్‌గా 97మార్కులను ముగ్గురు అభ్యర్థులు సాధించారు. అయితే ముగ్గురిలో వయసును పరిగణల్లోకి తీసుకొని ఎక్కువ వయసున్న రాఘవేందర్ రెడ్డిని జిల్లా టాపర్‌గా ఏపీపీఎస్సీ ప్రకటిం చింది. రాఘవేందర్రెడ్డితోపాటు ఈశప్ప, కోడేర్‌కు చెందిన మరో అభ్యర్థి టాపర్ల స్థానంలోనే రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈసారి ఓపెన్ కేటగి రిలో పురుషులు ప్రతిభను కనబర్చారు. ఓపెన్ కేటగిరి కోటా విషయానికొస్తే టాప్ టెన్‌లో ఇద్దరు మహిళలు మాత్రమే ఎంపికయ్యారు. ఇక మెరిట్ సాధించిన 500 మంది జాబితాను పరిశీలిస్తే కేవలం 26 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. అం టే వీరికి కేటాయించిన 33పోస్ట్‌లకు సరి పడా ఎంపిక కాలేదని తెలుస్తోంది. జిల్లా లో ఖాళీగా ఉన్న 103 వీఆర్వొ పోస్ట్‌లకు గాను 80,674మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారు. పరీక్షల్లో మాత్రం 71,302మంది మాత్రమే పాల్గొన్నారు. అభ్యర్థులందరు చూసుకునేలా వారు సాధించిన మార్కులను విడుదల చేశా రు. 97మార్కులను ముగ్గురు, 96మార్కులను ఐదుగురు, 95మార్కులను ఏడుగు రు, 94మార్కుల్ని 14మంది, 93మార్కు లు 20కి పైగా అభ్యర్థులు సాధించారు. వీఆర్ఏ టాపర్‌గా బుక్కతిమ్మప్ప జిల్లాలో ఖాళీగా ఉన్న 94 వీఆర్ఏ పోస్ట్‌లకు సంబంధించి జిల్లాకు పంపించిన ఫలితాల్లో టాపర్‌గా బుక్కతిమ్మప్ప నిలి చినట్లు సమాచారం. ఈఫలితాలు జిల్లా కు వచ్చిన ట్రిబ్యునల్ కోర్టు స్టేను జారీ చేయడంతో అధికారులు విడుదల చేయకుండా నిలిపేశారు. స్టేను పరిష్కరించాకే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటిస్తున్నారు. నేడు తుదిజాబితా.... జిల్లాకు వచ్చిన మెరిట్ జాబితాను రోస్టర్ ప్రకారం మెరిట్సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో అధికారులు బిజీగా నిమగ్నమయ్యారు. శనివారం అర్ధరాత్రి వరకు ఈకసరత్తును పూర్తి చేసుకొని ఆదివారం ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తామని డీఆర్వో రాంకిషన్ వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులందరికి వెంటనే సమాచారం ఇచ్చి ఈనెల 25లోగా వారి సర్టిఫికెట్లను తనిఖీ కార్యక్రమాన్ని పూర్తిచేస్తామన్నారు. అనంతరం 28న వారికి నియామక ఉత్తర్వులను అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చం దర్రావు, ఈసెక్షన్ ఇన్చార్జి తహశీల్దార్ బాలచందర్‌తోపాటు, సెక్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విజేతలు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్షా ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. వివరాలను సీసీఎల్ఏ వెబ్సైట్లో ఉంచారు. వీఆర్వో పరీక్షల్లో మండల కేంద్రమైన చెన్నూరుకు చెందిన టి.వెంకట సుధాకర్ అనే అభ్యర్థి (హాల్ టిక్కెట్ నెం.111107772) జిల్లా టాపర్‌గా నిలిచారు. బీసీ-బి కేటగిరికి చెందిన ఆయన 97 మార్కులు సాధించి ప్రథమస్థానంలో నిలిచారు. ఇక ఓసీ కేటగిరిలో వేముల మండలం గొల్లలగూడూరు గ్రామానికి చెందిన వైఎన్ హరినాథరెడ్డి (హాల్ టిక్కెట్ నెం. 111109961) అనే అభ్యర్థి ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆయన 97 మార్కులు సాధించారు. జిల్లాలో 27 వీఆర్వో ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఓసీ జనరల్‌కు 4, ఓసీ మహిళకు 3, ఓసీ మాజీ సైనికులకు చెందిన మహిళకు 1 కేటాయించారు. ఇక ఎస్సీ జనరల్‌కు 3, ఎస్సీ మహిళకు 2, ఎస్టీ జనరల్‌కు 2, ఎస్టీ మహిళకు 1, బీసీ గ్రూప్-ఏ జనరల్‌కు 2, బీసీ-బీ జనరల్‌కు 3, మహిళకు 1, బీసీ-డి జనరల్‌కు 2, మహిళకు 1, బీసీ-ఇ జనరల్‌కు 2 పోస్టులు కేటాయించారు. పరీక్షల్లో సాధించిన మార్కులను బట్టి రోస్టర్ ప్రకారం ఆయా వర్గాలకు ఉద్యోగాలను కేటాయించనున్నారు. ఈనెల 2వ తేదీన నిర్వహించిన పరీక్షలకు 24,981 మంది (87.16 శాతం) హాజరయ్యారు. అదేరోజు జిల్లాలోని 128 వీఆర్ఏ పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 1119 మంది (90.24 శాతం) హాజరయ్యారు. మహిళల కంటే పురుషులే ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు తెలుస్తోంది. గ్రూప్సే లక్ష్యం.. గ్రూప్స్ బాగా రాసి మంచి పోస్ట్ సాధించడమే నా లక్ష్యం. రోజులో ఎక్కువ సమయం చదివేందుకే కేటాయిస్తున్నా.. వీఆర్వో పోస్టులో చేరి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తా. - వెంకటసుధాకర్, చెన్నూరు గ్రామీణులకు సేవ చేస్తా.. ఇంజనీరింగ్ చదివినా.. గ్రామీణులకు సేవ చేయాలన్నదే నా కోరిక.. మంచి ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో గ్రూప్-1 సాధిస్తా. -హరినాథరెడ్డి, గొల్లలగూడూరు -
నేడు వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు
సాక్షి, నల్లగొండ: వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధం చేసింది. ఆదివారం 278 కేంద్రాల్లో జరగనున్న వీఆర్ఓ పరీక్షకు 85,431 మంది, 14 కేంద్రాల్లో జరగనున్న వీఆర్ఏ 4,997 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ జిల్లాకేంద్రంలోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్షల నిర్వహణలో మొత్తం 4,815 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు. అంతా వీడియో చిత్రీకరణ... ప్రశ్నపత్రాలు తెరిచింది మొదలు పరీక్ష అనంతరం ఓఎమ్మార్ షీట్లు సీల్ చేసేంత వరకు వీడియో చిత్రీకరిస్తారు. అంతేగాక అభ్యర్థుల జేబులను చెక్ చేయడం, స్క్రైబ్స్(సహాయకులు)ని సైతం వీడియోలో బంధిస్తారు. ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఉండేందుకు ఈ పద్ధతిని చేపడుతున్నారు. స్క్రైబ్స్.... చేతులులేని, దృష్టిలోపం, మస్తిష్క పక్షవాతం ఉన్న అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరవుతున్నారు. ఇలా వీఆర్ఓ పరీక్ష 26, వీఆర్ఏ పరీక్ష 10 మంది అభ్యర్థులు రాస్తున్నారు. వీరికి సహాయకులుగా పదో తరగతి చదువుతున్న విద్యార్థులను ఏర్పాటు చేస్తారు. ఈ బాధ్యత పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కి అప్పజెప్పారు. సహాయకులకు ఇన్విజిలేటర్‌తో సమానంగా వేతనం అందజేస్తారు. దృష్టిలోపం ఉన్న అభ్యర్థులకు గంటకు 10 నిమిషాల అదనపు సమయాన్ని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. అనుమతి లేకుండా పరీక్షకు హాజరైతే చర్యలే.. : ఉపాధ్యాయులకు డీఈఓ హెచ్చరిక నల్లగొండ అర్బన్ : అనుమతి పొందకుండా వీఆర్ఓ పరీ క్షకు హాజరయ్యే ఉపాధ్యాయులందరిపై సీసీఏ రూల్స్ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని డీఈఓ జగదీష్ హెచ్చరించారు. పరీక్షా హాలులో ఐ స్కానింగ్, ఫొటోగుర్తింపు, ముఖాన్ని సరిపోల్చడం, వేలిముద్రల సేకరణ, వీడియో టెక్నాలజీ తదితర ఆధారాలతో పరీక్షకు హాజరైనట్లు గుర్తిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని చెప్పారు. జైలు జీవితం తథ్యమని పేర్కొన్నారు.