‘ఇదం జగత్‌’ ఫస్ట్‌ లుక్‌! | Sumanth Idam Jagath First Look Released | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 25 2018 3:32 PM | Last Updated on Mon, Jun 25 2018 3:37 PM

Sumanth Idam Jagath First Look Released - Sakshi

‘మళ్లీ రావా’తో క్లాస్‌హిట్‌ కొట్టారు సుమంత్‌. చాలా కాలంపాటు సరైన హిట్‌ కోసం ఎదురు చూసిన సుమంత్‌కు ఈ సినిమాతో మంచి విజయం లభించింది. తనకు కలిసి వచ్చిన ప్రేమకథతోనే మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ప్రస్తుతం సుమంత్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. 

ప్రస్తుతం సుమంత్‌ రూట్‌ మార్చి ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ను  పట్టాలెక్కిస్తున్నారు . సుమం‍త్‌ ఫోటో జర్నలిస్ట్‌గా నటిస్తోన్నఈ సినిమాతో అనిల్‌ శ్రీకంఠం దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ మూవీలో ప్రేమమ్‌ ఫేం అంజు కురియెన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంతో పాటు సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న‘‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలోనూ నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement