‘సుబ్రహ్మణ్యపురం’ షూటింగ్‌ పూర్తి! | Sumanth Subramanyapuram Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 8 2018 5:41 PM | Last Updated on Mon, Oct 8 2018 5:44 PM

Sumanth Subramanyapuram Movie Shooting Completed - Sakshi

‘మళ్లీ రావా’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు అక్కినేని హీరో సుమంత్‌. ఈ మూవీ తరువాత డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నాడు. సుమంత్‌ ప్రస్తుతం ‘ఇదంజగత్‌’, ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాలుచేస్తున్నాడు. 

వీటిలో ఇదంజగత్‌ టీజర్‌ రిలీజై వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్‌గా సుబ్రహ్మణ్యపురం షూటింగ్‌ కూడా పూర్తైనట్టు సుమంత్‌ తెలిపాడు. ఈ రెండు చిత్రాలే గాక బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తోన్న ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈషా రెబ్బ  హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాతో  సంతోష్‌ జాగర్లమూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తారస్‌ సినీకార్ప్‌ పతాకంపై ధీరజ్‌ బొగ్గారం, బీరం సుధాకర్‌ రెడ్డి సుబ్రహ్మణ్యపురం సినిమాను నిర్మిస్తున్నారు. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమంత్‌ 25వ సినిమా కావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు శేఖర్‌ చంద్ర సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement