‘మళ్లీరావా’ లాంటి క్లాస్ హిట్ తరువాత సుమంత్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. చాలా కాలం తరువాత మంచి హిట్ కొట్టిన సుమంత్.. రూట్ మార్చి విభిన్న కథలతో ప్రయోగం చేస్తున్నాడు. ఇదంజగత్, సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమాలతో మళ్లీ సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా సుబ్రహ్మణ్యపురం ట్రైలర్‌ను విడుదల చేశారు.
‘మేమంతా భగవంతున్నే సర్చ్ చేస్తాము.. కానీ ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు’ , ‘గెలవడానికి ఆ భగవంతుడి సహాయం కావాలని మేము నమ్ముతాం.. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు’ లాంటి డైలాగ్‌లతో ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. ఆ ఊరు, గుడి, రహస్యం అంటూ మంచి ఇంట్రెస్ట్‌ను కలిగించేలా కట్ చేసిన ట్రైలర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈషారెబ్బ కథానాయికగా నటించగా.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment