Actor Sumanth Comments On Divorce And Second Marriages In His Latest Interview - Sakshi
Sakshi News home page

Sumanth: విడాకులపై సుమంత్‌ ఆసక్తికర కామెంట్స్‌, ఇప్పుడది కామన్‌.. మా ఇంట్లో..

Published Wed, Feb 9 2022 9:00 PM | Last Updated on Thu, Feb 10 2022 9:33 AM

Hero Sumanth Intresting Comments On Divorce In Latest Interview - Sakshi

Sumanth Intresting Comments On Divorce: నాగార్జు అక్కినేని మేనల్లుడు, హీరో సుమంత్‌ తాజాగా నటించిన చిత్రం మళ్లీ ముదలైంది. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో సుమంత్‌ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుమంత్‌ విడాకులపై ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఈ సందర్భంగా సుమంత్‌కు విడాకులపై ప్రశ్న ఎదురైంది.

చదవండి: 2022 ఆగస్ట్‌ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్‌ కామెంట్స్‌ వైరల్‌

దీనిపై స్పందించిన సుమంత్‌.. ‘నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారు. మా కుటుంబంలో కూడా విడాకులున్నాయి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు విడాకులు అనేవి కామన్ అయిపోయాయి’ అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేగాక ఈ విషయంలో తాను దురదృష్టం అనే పదాన్ని వాడదలుచుకోవాలనుకోవట్లేదని, అలా జరుగుతున్నాయంతే అన్నాడు. కానీ రెండో పెళ్లి విషయానికొచ్చేసరికి కొన్ని కష్టాలున్నప్పటికీ సర్ధుకుపోతున్నారన్నాడు. ఎందుకంటే, రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే ముద్ర పడిపోతుందని చెప్పుకొచ్చాడు. అందుకే రెండో పెళ్లిని ఎలాగోలా కొనసాగించాలని అంతా అనుకుంటారంటూ సుమంత్‌ ఆసక్తిగా స్పందించాడు.

చదవండి: అన్‌స్టాపబుల్‌: చిరంజీవితో ఎపిసోడ్‌పై షో రైటర్‌ ఆసక్తికర కామెంట్స్‌

కాగా డివోర్స్ కాన్సెప్ట్‌‌తో తెరకెక్కిన ఈ మూవీలో సుమంత్‌ భార్యకు విడాకులు ఇచ్చిన భర్తగా నటించాడు. కీర్తి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించింది. ఇదిలా ఉంటే గతంలో సుమంత్‌ ‘తొలిప్రేమ’ హీరోయిన్‌ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం కీర్తిరెడ్డి రెండో పెళ్లి చేసుకోగా.. సుమంత్‌ మాత్రం మళ్లీ పెళ్లి జోలికి వెళ్లలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement