Sumanth: Malli Modalaindi Movie Will Streaming On Zee5 - Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి.. సుమంత్ 'మళ్ళీ మొదలైంది' మూవీ

Published Thu, Jan 20 2022 9:21 PM | Last Updated on Fri, Jan 21 2022 9:08 AM

Sumanth Malli Modalaindi Will Streaming On Zee5 - Sakshi

Sumanth Malli Modalaindi Set to Release On OTT: సుమంత్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'మళ్ళీ మొదలైంది'. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? ఎలా ఉంటుంది అన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ న్యాయవాది, మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌గా నైనా గంగూలీ నటించారు.  టీజీ కీర్తి కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఈడీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు.

గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది.  'జీ 5' ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.'జీ 5' ఓటీటీలో ఈ నెల 21న 'లూజర్' సీజన్ 2 విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'మళ్ళీ మొదలైంది'తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement