Sumanth Malli Modalaindi Movie In Zee5: సుమంత్ హీరోగా నటించిన చిత్రం ‘మళ్లీ మొదలైంది’. సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్‌రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథతో రూపొందిన సినిమా ఇది. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుమంత్ మాట్లాడుతూ – ‘‘విడాకుల నేపథ్యంలో దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా. ఈ చిత్రంలోని ‘అలోన్.. అలోన్’ సిగ్నేచర్ సాంగ్ అవుతుంది. అనూప్ రూబెన్స్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘ముగ్గురు అమ్మాయిల మధ్య జరిగే కథ ఇది’’ అన్నారు కీర్తీ కుమార్. ‘‘కథలోని ఎమోషన్స్‌ను స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా క్యారీ చేయాలని దర్శకుడితో అన్నాను.. అలాగే చేశారు’’ అన్నారు రాజశేఖర్. ‘బన్నీ’ వాసు, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Malli Modalaindi Movie: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో 'మళ్లీ మొదలైంది'.. అప్పటి నుంచే
Published Sun, Feb 6 2022 11:53 AM | Last Updated on Sun, Feb 6 2022 11:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment