సూపర్‌ థ్రిల్లర్‌ | Sumanth's Subramaniapuram gets a fancy price for overseas rights | Sakshi
Sakshi News home page

సూపర్‌ థ్రిల్లర్‌

Published Mon, Aug 20 2018 12:42 AM | Last Updated on Mon, Aug 20 2018 12:42 AM

Sumanth's Subramaniapuram gets a fancy price for overseas rights - Sakshi

సుమంత్

సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ కాకముందే ఓవర్‌సీస్‌ (భారతదేశం బయట మార్కెట్‌) బిజినెస్‌ కంప్లీట్‌ అయిపోయి ఆసక్తిని పెంచుతోంది సుమంత్‌ లేటెస్ట్‌ సినిమా ‘సుబ్రహ్మణ్యపురం’.  కంట్రీసైడ్‌ పిక్చర్స్‌ ఈ సినిమా ఓవర్‌సీస్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో సుమంత్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుతున్నాం. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం లాస్ట్‌ అర్ధగంటలోని గ్రాఫిక్స్‌ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఫ్యాన్సీ రేట్‌కు ఓవర్‌సీస్‌ రైట్స్‌ అమ్ముడుపోవడం హ్యాపీగా ఉంది. సుమంత్‌ కెరీర్‌ బెస్ట్‌ ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర, కెమెరా: ఆర్‌.కె.ప్రతాప్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement