Malli Modalaindi Trailer Release: హీరో సుమంత్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘మళ్లీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మళ్లీ మొదలైంది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీటర్ వేదికగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశాడు. ఇందులో సుమంత్‌కు జోడిగా నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించగా, అతని భార్యగా యాంకర్ వర్షిణి నటిస్తోంది.
చదవండి: ‘రొమాంటిక్’ ప్రీమియర్ షోలో స్టార్స్ సందడి, ఫొటోలు వైరల్
MARRIAGE 😡and DIVORCE 😍 watch the inspiring trailer of #MalliModalaindi starring @iSumanth @NainaGtweets https://t.co/5N4xTniKQe
— Ram Gopal Varma (@RGVzoomin) October 28, 2021
ఈ ట్రైలర్ విషయానికోస్తే.. ఈ ట్రైలర్‌లో ముందుగా టామ్ క్రూయిజ్-నికోల్ కిడ్.. మ్యాన్ బిల్ గేట్స్-మిలిందా గేట్స్.. బ్రాడ్ ఫైట్-ఏంజిలినా జోలీ జంటలను చూపిస్తూ కొన్ని పెళ్లిళ్లు విడాకులతో ఎండ్ అవుతాయి అని చూపించారు.. విడాకుల తర్వాత ఒక మగాడి జీవితంలో జరిగిన పరిణామాలు, సానుభూతులు, తిరిగి మరోఅమ్మాయిని ప్రేమించడం ఇవన్నీ ట్రైలర్‌లో చూపించారు. మొదటి భార్య అయిన వర్షిణితో విడాకులు తీసుకున్న సుమంత్.. ఈ కేసులో తన భార్య తరపున వాధించిన లాయర్ నైనా గంగూలిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో దింపడానికి ప్రయత్నించడం ట్రైలర్‌లో చూపించారు. చూస్తుంటే విడాకుల అనంతరం ఓ మగాడి జీవితం ఎలా ఉంటుందనేది ఈ చిత్రంలో చూపించనున్నారని అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment