ఓ సీక్రెట్‌ చెప్పనా..! | Citadel Honey Bunny Official Trailer Launch, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Citadel Honey Bunny Trailer: ఓ సీక్రెట్‌ చెప్పనా..!

Published Wed, Oct 16 2024 12:07 AM | Last Updated on Wed, Oct 16 2024 10:45 AM

Citadel: Honey Bunny Official Trailer Launch

వరుణ్‌ ధావన్, సమంత లీడ్‌ రోల్స్‌లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్‌’ సిరీస్‌ ఫేమ్‌ రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌ను రూపొందించారు. అమెరికన్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌గా ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ రానుంది. ఈ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ‘ప్రతి రోజూ ఓ ప్రమాదం ముంచుకొస్తుంది.

ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటుంది. సవాల్‌ ఏంటంటే... ఈ ప్రమాదాలను మనం అంతం చేస్తామా? లేక అవి మనల్ని అంతం చేస్తాయా? అన్నది, నాడియా... నీకొక సీక్రెట్‌ చెప్పనా.. నేనొక ఏజెంట్‌’ వంటి డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ సిరీస్‌లో సినీ నటి హనీగా సమంత, స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ బన్నీగా వరుణ్‌ ధావన్‌ కనిపిస్తారు. కానీ ఈ ఇద్దరూ ఏజెంట్స్‌. ఈ ఇద్దరూ ఓ మిషన్‌ కోసం ఎలాంటి పోరాటాలు చేశారన్నది సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం. అమెజాన్‌ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement