‘సుబ్రహ్మణ్యపురం’కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ | Subrahmanyapuram Teaser Reaches 1 Million Views | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 20 2018 1:45 PM | Last Updated on Sat, Oct 20 2018 1:45 PM

Subrahmanyapuram Teaser Reaches 1 Million Views - Sakshi

సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఈషారెబ్బా కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. విజయదశమి కానుకగా సోషల్‌మీడియాలో విడుదల చేసిన ఈ చిత్ర టీజర్‌ 24 గంటల్లో 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ రాబట్టి ట్రెండ్‌ అవుతోంది.

ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ..  భక్తి ప్రధాన ఇతివృత్తంతో సాగే మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇది. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యముంటుంది. నా సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకముంది.. అని తెలిపారు.

నిర్మాత బీరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న ఇరవై ఐదవ చిత్రమిది. ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. తాజాగా విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సుదీర్ఘ విరామం త‌ర్వాత ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంగారు ఈ సినిమాలో ఓ గీతాన్ని ఆలపించారు. ఈ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మధుర ఆడియో ద్వారా పాటలను త్వరలోనే విడుదల చేయనున్నాం.. అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement