ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే? | Sumanth Aham Reboot Movie Getting Huge Response In OTT Release, Know Streaming Minutes Inside | Sakshi
Sakshi News home page

Aham Reboot OTT Response: నేరుగా ఓటీటీలో రిలీజ్.. ఇప్పుడేమో 2 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్‌

Published Sat, Jul 20 2024 11:41 AM | Last Updated on Sat, Jul 20 2024 12:18 PM

Sumanth Aham Reboot OTT Details And Streaming Minutes

డిఫరెంట్ సినిమాలు తీస్తే తెలుగు ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణ వేరు. అలా అక్కినేని హీరో సుమంత్ కొత్తగా 'అహం రీబూట్' పేరుతో ఈ మూవీ రిలీజ్ చేశాడు. కొన్నిరోజుల క్రితం నేరుగా ఓటీటీలోకి రాగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంటోంది. తాజాగా 2 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన డిఫరెంట్ తెలుగు సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి')

కేవలం ఒక్క పాత్రతో తీసిన సినిమా 'అహం రీబూట్'. అప్పుడెప్పుడో షూటింగ్ జరగ్గా, థియేటర్ రిలీజ్ కోసం చాలారోజులుగా ఎదురుచూశారు. కానీ ఏది సెట్ అవ్వకపోవడంతో జూలై 1న ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు దీనికే రెండు కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయి. ఇందులో సుమంత్ రేడియో జాకీగా నటించాడు.

'అహం రీబూట్' స్టోరీ విషయానికొస్తే.. ఆర్జే నిలయ్ ఓరోజు తన రేడియో స్టేషన్‌లో రాత్రిపూట పనిచేస్తుండగా.. ఓ అమ్మాయి కాల్ చేస్తుంది. తను ఆపదలో ఉన్నానని చెప్పి, కాపాడమని వేడుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? స్టూడియో నుంచే నిలయ్.. ఆ అమ్మాయిని ఎలా రక్షించాడు అనేదే కాన్సెప్ట్. కేవలం గంటన్నర నిడివితో తీయగా, థ్రిల్లర్ చిత్రాలు చూసే ఆడియెన్స్‌కి నచ్చేస్తోంది!

(ఇదీ చదవండి: ఇండస్ట్రీ అంతా ఒక్క వెబ్ సిరీస్‪‌‌లో... ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement