ఓటీటీ వేదికగా గుర్తింపు పొందుతున్న వినూత్న ప్రయోగం..
2 నెలల్లో 2 కోట్ల వ్యూస్ సొంతం చేసుకున్న అహం రీబూట్..
న్యూ ఫిల్మ్ మేకింగ్‌కు పట్టం కడుతున్న ప్రేక్షకులు..
ఒకే ఒక్క క్యారెక్టర్.. దాదాపు గంటన్నర సినిమా. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదలై, కొత్తదనాన్ని ప్రదర్శిస్తున్న సినిమా ‘అహం రీబూట్’. ఫిల్మ్ మేకింగ్‌లో..ఓటీటీ ఫ్లాట్‌ఫాం వినూత్న ప్రయోగాలకు వేదికగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఐతే ఓటీటీ వేదికగా సినిమా రూపు రేఖలే మార్చుతూ విభిన్న కథాంశంతో, సరికొత్త సినిమాటిక్ ఫీల్‌తో వస్తున్న సినిమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కోవలోకే వస్తుంది ప్రముఖ సినీనటుడు సుమంత్ నటించిన ‘అహం రీబూట్’. నగరం వేదికగా రూపుదిద్దుకున్న ఈ సినిమా మరోసారి తెలుగువారి ప్రమోగాత్మకతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఆహాలో విడుదలైన 2 నెలల్లోనే 2 కోట్ల మంది వీక్షించిన సినిమాగా దూసుకుపోతుంది. ఈ సందర్భంగా తన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు దర్శకులు ప్రశాంత్ సాగర్..,
95 నిమిషాల నిడివి ఉన్న సినిమా పూర్తైయ్యేంత వరకు ఒకే ఒక్క క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు అనుసంధానం చేయడం అంత సులువు కాదంటున్నారు దర్శకులు ప్రశాంత్‌సాగర్. సినిమా కోసమే నగరానికొచ్చి, సినిమాతోనే ప్రయాణం చేయాలంటే ఇంతకుమందెన్నడూ చూడని ప్రయోగాలను ఆసక్తికరంగా చూపించగలగాలని ఆయన అంటున్నారు.
ఒక రాత్రిలో జరిగే కథతో రూపొందించుకున్న ఈ సినిమాను అక్కినేని సుమంత్‌కు చెప్పాను. వినూత్న ప్రయోగాలు, నూతనత్వం ఉన్న కథాంశాలను వదులుకోని సుమంత్..ట్రయల్ ట్రైలర్ అడిగారు. ఆయన అడిగినట్టుగానే చేసి ఇవ్వడంతో నో చెప్పకుండా చేసి ఒప్పుకున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని ఈ మధ్యనే అమేజాన్ వేదిక కూడా ప్రసారం చేస్తుంది.
సోలో క్యారెక్టర్‌తో గతంలోనూ ఒకటీ, రెండూ సినిమాలు వచ్చినప్పటికీ ఓటీటీ వేదికగా కొత్త ఫిల్మ్ మేకింగ్‌తో ఆకట్టుకుంటుంది అహమ్ రీబూట్. కొత్త సినిమాను పరిచయం చేయాలనే నిర్మాత రఘువీర్ గోరపర్తి లక్ష్యం నెరవేరడం మరింత సంతృప్తినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగంతో కంటెంట్ రైటర్ సుమలత, ప్రేక్షకులను సంగీతంతో ఎంగేజ్ చేసిన శ్రీరాం మద్దూరి మంచి గుర్తింపు పొందుతున్నారు. చిన్న, పెద్ద అని తేడాలేకుండా, నాన్ కమర్షియల్, డీగ్లామర్ సినిమాను కూడా ప్రేక్షకులు ఇంతలా ఆదరించడం తమలాంటి సినిమా ప్రేమికులకు శుభపరిణామం అని అన్నారు
Comments
Please login to add a commentAdd a comment