అక్కినేని హీరో సుమంత్ కొత్త కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ హీరోకు గతకొంతకాలం పాటు సరైన విజయం దక్కలేదు. రీసెంట్‌గా ‘మళ్లీరావా’తో ఫామ్‌లోకి వచ్చి.. వరుసగా ప్రాజెక్ట్‌లను ఓకే చేస్తున్నాడు.
తాజాగా ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. మొత్తంగా 132నిమిషాల వ్యవధితో ఉన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదలచేస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భీరం సుధాకర్ రెడ్డి నిర్మించారు. సుమంత్ జర్నలిస్ట్‌గా నటిస్తున్న ‘ఇదంజగత్’ కూడా విడుదలకు సిద్దంగా ఉంది.
It's U/A for @iSumanth's supernatural thriller #SubramanyaPuram with crisp runtime of 132 mins.
— BARaju (@baraju_SuperHit) 24 November 2018
Movie is releasing on Dec 7th.
Produced by #BeeramSudhakaraReddy
Directed by #SanthosshJagarlapudi@YoursEesha @MadhuraAudio pic.twitter.com/BAGL2dE8NO
Comments
Please login to add a commentAdd a comment