
సుమంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వంలో రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11 నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘విడాకులు తీసుకున్న ఓ జంట కథ కొత్తగా మళ్లీ ఎలా మొదలైంది అన్నదే మా ‘మళ్ళీ మొదలైంది’. నా స్నేహితుడి జీవితంలోని కొన్ని సంఘటనలతో ఈ సినిమాను తీశాం. ‘నా సర్కిల్‌లో సినిమాకు మంచి స్పందన వస్తోంది’ అని సుమంత్ అనడంతో హ్యాపీ ఫీలయ్యాను’’ అన్నారు.
ఇంకా మాట్లాడుతూ – ‘‘ ఆడియన్స్ లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వల్ల మరింత అప్‌డేట్ అయ్యారు. కంటెంట్ బేస్డ్ సినిమాలనే ఇష్టపడుతున్నారు. నేనూ అలాంటి సినిమాలనే తీయాలనుకుంటున్నాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment