టీనేజ్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఉంది! | Rumer Willis wanted plastic surgery as a teenager | Sakshi
Sakshi News home page

టీనేజ్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఉంది!

Published Thu, Apr 9 2015 8:46 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

టీనేజ్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఉంది! - Sakshi

టీనేజ్ కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఉంది!

లాస్ ఏంజిల్స్: టీనేజ్.. అదొక అందమైన ప్రాయం. టీనేజ్ అనుభవంలోకి వెళ్లాలని ప్రతి ఒక్కరూ ఆశించడం సహజంగానే జరుగుతూ  ఉంటోంది. ప్రస్తుతం 26 ఏళ్ల హాలీవుడ్ నటి రూమర్ విలిస్ ఆ అనుభవంలోకి వెళ్లాలని తెగ ఆరాటపడిపోతోంది. దీనికి కారణం ఉందండోయ్. బ్రూస్ విలిస్, డేమీ మూర్ ల కుమార్తె అయిన రూమర్.. నటనాపరమైన తన కెరీర్ లో దూసుకుపోతోంది. అది తనకు విపరీతమైన క్రేజ్ తేవడం కాస్తా తలనొప్పిగా మారిందట.

 

'మనం వెలుగులోకి వచ్చాక చుట్టూ చోటు చేసుకునే పరిస్థితులను భరించడం నిజంగా చాలా కష్టం. అదే నేను టీనేజ్ లో ఉన్నప్పుడు అటువంటి ఏమీ లేదు. ప్రస్తుతం ఉన్న నా శరీరాకృతి నాకు అనుకూలంగా ఉందని అనిపించడం లేదు. మా నాన్న, అమ్మ కూడా విస్తు గొలిపే అందంతో ఉంటారు. నాకు కూడా నిగారింపుతో కూడిన అందం కావాలని అనుకుంటున్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి  ఆ కోరిక బలంగా ఉంది. ఈ క్రమంలోనే నా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని ఉంది. అది నా వయసును టీనేజ్ లోకి తీసుకు వెళుతుందో లేదో అనేది మాత్రం కచ్చితంగా వేచి చూడాల్సిందే అంటోంది రూమర్ విలిస్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement