
అందంపై మోజు మహిళ ప్రాణం తీసింది
మియామీ(ఫ్లోరిడా): ఆకర్షణీయంగా కనిపించాలని కేవలం కాస్మొటిక్ సర్జరీ కోసమే పశ్చిమ వర్జీనియా నుంచి మియామీ వచ్చిన ఓ మహిళకు అదే చివరి ప్రయాణమయ్యింది. బ్రెజీలియన్ బట్ లిఫ్ట్(పిరుదులు పెద్దగా కనిపించడానికి చేసే సర్జరీ)తో ఆకర్షణీయంగా కనిపించాలనుకుంది. వర్జీనియాకు చెందిన హీతర్(29) అనే మహిళ 'బట్ లిఫ్ట్' సర్జరీ ఫెయిల్ అవ్వడంతో హిలియాలో మృతి చెందింది. గుండెకు రక్త సరఫరా చేసే నాళాల్లో కొవ్వు అడ్డుపడటంతో(ఫ్యాట్ ఎంబోలిజమ్) ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు చెబుతున్నారు.
బ్రెజీలియన్ బట్ లిఫ్ట్ పద్దతిలో ముందు లైపోసెక్షన్ ద్వారా ఉదరభాగం నుంచి కొవ్వును తీసి పిరుదుల స్థానంలో ఇంజక్ట్ చేస్తారు. సర్జరీ చేస్తున్న సమయంలో కొవ్వు పదార్థల మార్పిడిలో చోటుచేసుకున్నతప్పిదంతో ఆమె అవయవాలు పనిచేయకుండా పోయాయి. దీంతో వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. హీతర్కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.