మౌనీరాయ్‌ ప్లాస్టిక్‌ సర్జరీలు ఫెయిలయ్యాయా? | Mouni Roy Trolled For Getting Plastic Surgeries | Sakshi
Sakshi News home page

మౌనీరాయ్‌ ప్లాస్టిక్‌ సర్జరీలు ఫెయిలయ్యాయా?

Published Wed, Jun 5 2019 8:02 PM | Last Updated on Wed, Jun 5 2019 9:06 PM

Mouni Roy Trolled For Getting Plastic Surgeries - Sakshi

‘నాగినీ’ సీరియల్‌ స్టార్‌, బాలీవుడ్‌ కథానాయిక మౌనీ రాయ్‌ ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ ‘భారత్‌’ సినిమా ప్రీమియర్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఆమె ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడంతో ట్రోల్స్‌ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఫొటోలను చూసిన పలువురు ట్రోలర్స్‌.. మౌనీరాయ్‌ ప్లాస్టిక్‌ సర్జరీలతో తన సహజ అందాన్ని పాడు చేసుకుందని, మరింత అందం కోసం చేయించుకున్న సర్జరీలు సక్సెస్‌ కాకపోవడంతో ఆమె వికారంగా తయారైందని విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే ప్లాస్టిక్‌ సర్జరీల కారణంగా మౌనీరాయ్‌.. రాఖీ సావంత్‌లా కనిపిస్తోందని, మైఖేల్‌ జాక్సన్‌లా మారిందని కామెంట్లు పెడుతున్నారు. 

నియాన్‌ గ్రీన్‌ జాకెట్‌, బ్లాక్‌ డ్రెస్‌ వేసుకొని ‘భారత్‌’ ప్రీమియర్‌ ఈవెంట్‌కు కాజువల్‌గా మౌనీ రాయ్‌ హాజరయ్యారు. లూక్‌పరంగా ఆమె పెదవులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆమె ఫొటోలపై నెటిజన్లు తలోరకంగా కామెంట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీలు ఆమె అందాన్ని నాశనం చేశాయని, మీ పెదవులకు ఏమైంది.. సర్జరీ ఫెయిలైందా? సహజ అందగత్తె అయిన మౌనీరాయ్‌ తన అందంపై నమ్మకం లేకనే.. ఇలా సర్జరీలు చేయించుకుంటోందని ట్రోలర్స్‌ రెచ్చిపోతున్నారు. అయితే, తన ఫొటోలపై వ్యక్తమవుతున్న నెగటివ్‌ కామెంట్లపై మౌనీరాయ్‌ ఇంతవరకు స్పందించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement